రాజ‌శేఖ‌ర్‌, జీవిత‌ల ముద్దుల కుమార్తె శివాని. 2స్టేట్స్ చిత్రం ద్వారా హీరోయిన్‌గా ప‌రిచ‌యం కాబోతున్న విష‌యం తెలిసిందే.  బాలీవుడ్ మూవీ 2 స్టేట్స్‌కి ఇది తెలుగు రీమేక్. ఇటీవ‌లె గూఢాచారి చిత్రం తో హిట్ కొట్టిన అడ‌విశేషు ఇందులో హీరోగా న‌టిస్తున్నారు. వెంక‌ట్ కుంచెం ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రానికి అనూప్ సంగీతాన్ని స‌మ‌కూరుస్తున్నారు.

ఈ సినిమాని సినీ ప్ర‌ముఖుల స‌మ‌క్షంలో చాలా గ్రాండ్‌గా ప్రారంభించారు. ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి ముహుర్త‌పు స‌న్నివేశానికి క్లాప్ ఇచ్చారు. అయితే.. ఇప్పుడు ఈ సినిమా ఆగిపోయింది. త‌మ‌ కుమార్తె మొద‌టి సినిమానే ఆగిపోవ‌డంతో జీవితారాజ‌శేఖ‌ర్ దంప‌తులు చాలా ఫీల‌వుతున్నార‌ట‌. అస‌లు విష‌యానికి వ‌స్తే షూటింగ్ కొంత పూర్త‌య్యాక సినిమాని చూస్తే అస్స‌లు బాలేద‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి.

ఇక జీవిత రంగంలోకి దిగి త‌న కుమార్తె కోసం ఎలాగైనా ఈ చిత్రాన్ని పూర్తి చేద్దామ‌ని కంక‌ణం క‌ట్టున్నా ఫ‌లితం మాత్రం సూన్యం. దాంతో ఈ దంప‌తుల‌కు ఏం చేయాలో అర్ధం కాక చాలా మ‌న‌ద‌న‌ప‌డుతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: