సూపర్ స్టార్ మహేష్ 25వ సినిమాగా మరో రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సినిమా మహర్షి. వంశీ పైడిపల్లి డైరక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాను ముగ్గురు బడా నిర్మాతలు కలిసి నిర్మించడం విశేషం. పూజా హెగ్దె హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించారు. ఇక సినిమాలో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశాడు అల్లరి నరేష్. సినిమా ట్రైలర్ లో మహేష్ మూడు పాత్రలు ఫోకస్ చేసినా అల్లరి నరేష్ పాత్రని లైట్ గా చూపించారు.


కాని అసలు మహర్షి సినిమా నడిపించేది అల్లరి నరేష్ అని తెలుస్తుంది. సినిమాలో నరేష్ పాత్ర ముందే అంచనాలు పెంచేస్తే ఆడియెన్స్ థ్రిల్ ఫీల్ అవ్వరని అందుకే ప్రమోషన్స్ లో నరేష్ ను మాట్లాడనివ్వలేదని అంటున్నారు. సినిమా రిలీజ్ తర్వాత నరేష్ పాత్ర ఆడియెన్స్ లోకి బాగా వెళ్తుందని అంటున్నారు. ముందునుండి నరేష్ కూడా నన్ను నమ్మి ఇంత సీరియస్ రోల్ ఇచ్చినందుకు థ్యాంక్స్ అని అన్నాడు. అంటే రిషి పాత్రకు స్పూర్తినిచ్చేది.. రిషి మారేందుకు మార్గం చూపేది నరేష్ పాత్ర అని తెలుస్తుంది. 


ఇక సినిమాలో రైతు సమస్యల గురించి కూడా ప్రస్థావిస్తారని తెలుస్తుంది. అందుకే ఇదే కదా ఇదే కదా సాంగ్ లో మహేష్ వరి నాటడం.. నాగలి పట్టడం లాంటివి చేస్తున్నాడు. ఓ యూనివర్సల్ సబ్జెక్ట్ తో మేమంతా ప్రేక్షకుల మనసు గెలిచేందుకు సిద్ధమయ్యాం అంటున్నారు మహర్షి టీం. థియేటర్ నుండి బయటకు వస్తూ బరువెక్కిన హృదయాలతో వస్తారట. మొత్తానికి మహర్షి నెల క్రితం పరిస్థితి వేరేలా ఉండగా రిలీజ్ ముందు మాత్రం భారీ క్రేజ్ వచ్చింది.


మహేష్ 25వ సినిమాగా.. సంక్రాంతి తర్వాత పెద్ద సినిమాలేవి లేవు కాబట్టి కచ్చితంగా మహర్షికి మంచి ఓపెనింగ్స్ దానితో పాటుగా రికార్డులు సృష్టించడం ఖాయమని చెప్పొచ్చు. మహర్షి సినిమా మ్యూజిక్ పరంగా కూడా మంచి రెస్పాన్స్ తెచ్చుకుంటుంది. పాటలు పర్వాలేదు అనిపించగా సినిమా ఎలాంటి ప్రభంజనాలు సృష్టిస్తుందో చూడాలి. 


మరింత సమాచారం తెలుసుకోండి: