పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలకు కాస్త బ్రేక్ ఇచ్చి ఏపి ఎలక్షన్స్ లో తను స్థాపించిన జనసేన తరపున బాగా కష్టపడ్డారు. హాయిగా సినిమాలు చేసుకోక ఇంతనికి ఎందుకొచ్చింది ఈ కష్టం అని అనుకున్న వారు ఉన్నారు. ఇదిలాఉంటే తాను చేయాల్సిందంతా చేసి రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నాడు పవన్ కళ్యాణ్.


ఇదిలాఉంటే మళ్లీ పవన్ కళ్యాణ్ గాలి సినిమాల వైపు మళ్లిందని తెలుస్తుంది. అందుకే ఇదవరకు తనకు అడ్వాన్సులు ఇచ్చిన వారికి కబురు పంపాడట. మైత్రి మూవీ మేకర్స్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో సినిమాకు బిగ్ డీల్ కుదుర్చుకుంది. ఆ సినిమా త్వరలో సెట్స్ మీదకు వెళ్లనుందని తెలుస్తుంది.


అయితే ఈ సినిమాకు పవన్ కళ్యాణ్ 40 రోజుల కాల్ షీట్ ఇచ్చారట. ఈ 40 రోజుల్లోనే సినిమా పూర్తి చేయాలని చెప్పారట. స్టార్ హీరో సినిమా 40 రోజులంటే కష్టం కాని పవన్ ఎపిసోడ్స్ వరకు ఆ ఫార్టీ డేస్ లో కంప్లీట్ చేయొచ్చు. ఇక ఈ సినిమాకు రెమ్యునరేషన్ గా 30 కోట్ల దాకా తీసుకుంటున్నాడట పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.


సీన్ లోకి ఎంటర్ అయ్యే వరకే అవతల వాళ్ల ఆటలు సాగేది వన్స్ ఐ స్టెప్ ఇన్ హిస్టరీ రిపీట్స్ అన్నట్టుగా పవర్ స్టార్ సినిమాల నుండి పక్కకు జరిగితే మిగతా వాళ్లు తమ ప్రతాపం చూపిస్తున్నారు. మళ్లీ పవన్ సినిమాల్లోకి వస్తే అతని స్టామినా ఏంటో తెలుస్తుంది. అజ్ఞాతవాసి తర్వాత పవన్ రాజకీయాల్లో బిజీ అయ్యారు. మరి పవన్ సినిమా ఎలా ఉంటుంది.. ఆ సినిమా డైరక్టర్ ఎవరన్న విషయాలు ఇంకా తెలియాల్సి ఉంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: