"బాహుబలి" బిగినింగ్, "బాహుబలి" కన్‌క్లూజన్.. ప్రపంచ వ్యాప్తంగా సృష్ఠించిన రికార్డులు తెలుగు చలన చిత్ర ఘన కీర్తిని అమాంతం పెంచేశాయి. ఒకరకంగా చెప్పాలంటే తెలుగు చిత్ర పరిశ్రమ బాహుబలికి ముందు, బాహుబలికి తర్వాత అనే స్థాయిని క్రియోట్ చేశారు దర్శకధీరుడు రాజమౌళి. ఈ ఒక్క సినిమాతో రాజమౌళి స్టామినా తెలుగు చిత్ర ఘనత ప్రపంచం మొత్తం చెప్పుకునేలా  బాహుబలి సెన్షేషన్ ని క్రియోట్ చేసింది. ఈ సినిమా తర్వాత బాలీవుడ్ లో పద్మావత్, థగ్స్ ఆఫ్ హిందుస్థాన్, మణికర్ణిక వంటి సినిమాలు భారీ బడ్జెట్ తో రూపొందించినప్పటికి బాహుబలి స్థాయిని చేరలేకపోయాయి. ఇప్పుడు ఆ స్థాయిని చేరుకోవడానికి బాహుబలి రికార్డులను బద్ధలు కొట్టడానికి మెగాస్టార్ సైరా తో సిద్దమవుతున్నారు.


బాహుబలికి ధీటుగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి ఈ సినిమాను అత్యధ్బుతంగా తీర్చి దిద్దుతున్నాడు. కొణిదెల ప్రొడక్షన్ పతాకంపై మెగా పవర్ స్టార్ రాం చరణ్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ మెగా స్టార్ అమితాబ్ బచ్చన్, విజయ్ సేతుపతి, జగపతి బాబు, నయనతార, తమన్నా తదితరులు ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. పరుచూరి బ్రదర్స్ కథను అందించిన ఈ సినిమాకు సాయి మాధవ్ బుర్రా పవర్‌ఫుల్ డైలాగ్స్ ని రాస్తున్నారు. ఉయ్యాలవాడ నరసింహా రెడ్డిగా..మెగాస్టార్ ను వెండితెరమీద అద్భుతంగా చూపించబోతున్నాడట డైరెక్టర్ సురేందర్ రెడ్డి.     


ఇక "మెగాస్టార్" బర్ట్ డే సందర్భంగా ఆగస్ట్ 22న మెగా ఫ్యాన్స్ కి చిత్ర బృందం సర్‌ప్రైజ్ ఇవ్వబోతోందట. 2019 అక్టోబర్ లో ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్టుగా సమాచారం. ఇక దర్శకుడు సురేందర్ రెడ్డి ఈ భారీ ప్రాజెక్ట్ ను అద్భుతంగా ఢీల్ చేస్తున్నాడని, మెగాస్టార్ వెండితెరపై ఇంతక ముందెన్నడు చూడని విధంగా ఎంతో గొప్పగా కనిపించబోతున్నారని ఇండస్ట్రీ చెప్పుకుంటోందట. అంతేకాదు బాహుబలి ని బీట్ చేసే విధంగా "సైరా" సిద్ధమవుతోందని లేటెస్ట్ అప్‌డేట్. "సైరా" తో మెగా అభిమానులు ఎన్ని రోజులు పండగ చేసుకుంటారో చూడాలి.      


మరింత సమాచారం తెలుసుకోండి: