మరి కొద్ది గంటల్లో వెండితెరపై విడుదల కాబోతున్న 'మహర్షి' సినిమా పై మహేష్ అభిమానులు విపరీతమైన అంచనాలు పెట్టుకున్నారు. ఇప్పటికే ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్న మహేష్ బాబు తాజాగా ఓ ప్రముఖ ఛానల్ ఇంటర్వ్యూలో ఈ సినిమాకి సంబంధించిన విశేషాలను తెలియజేస్తూ ఉన్న సందర్భంలో ఆ ఛానల్ ఇంటర్వ్యూ లో భాగంగా మహేష్ ని ఇరుకున పెట్టే విధంగా ప్రశ్న వేశారు ఆ చానల్ యాంకర్.

Related image

ఇంతకీ మహేష్ ని అడిగిన ప్రశ్న ఏమిటంటే ఇక్కడే ఉంటారా లేకపోతే బాలీవుడ్కి వెళ్లిపోతారని మహేష్ ని ప్రశ్నించారు. దీంతో వెంటనే మహేష్ మాట్లాడుతూ...మన దిగ్గజ దర్శకుడు రాజమౌళి చేస్తున్న సినిమాలు మన దగ్గర కంటే జాతీయ అంతర్జాతీయ స్థాయిలో బీభత్సంగా గుర్తింపు తెచ్చుకున్నాయి..దీన్ని బట్టి ఏం అర్థమైంది అంటే ఇక్కడ  కూడా అద్భుతాలు చేయవచ్చు అని రాజమౌళి ఋజువు చేశారు.. ఉదాహరణగా చెప్పాను.

Image result for rajamouli mahesh babu

కాబట్టి టాలీవుడ్ లోనే ఉంటానని మహేష్ ఘంటాపధంగా తెలిపారు. తన కెరియర్ లో 25వ సినిమా అయిన నేపథ్యంలో 'మహర్షి' తనకు ప్రత్యేకమైన సినిమా అంటూ కచ్చితంగా ఇది ప్రేక్షకులను బాగా అలరిస్తుందని వంశీ పైడిపల్లి దర్శకత్వం లో పనిచేయడం చాలా ఆనందంగా ఉందని మహేష్ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: