టాలీవుడ్లో ఎందరో టాలెంటెడ్ డైరెక్టర్లు ఉన్నారు. వారంతా అవకాశం రావాలే కానీ అద్భుతాలే ఆవిష్కరించగలరు. అటువంటి సీనియర్ల పరిస్థితి ఇపుడు ఎలా తయారైంది అంటే ఎక్కే గుమ్మం, దిగే గుమ్మంగా మారింది. వీరి క్రియేటివిటీ మీద స్టార్స్ కి నమ్మకం లేదా కొత్త వాళ్ళే బెటర్ అనుకుంటున్నారా అన్నది తెలియదు కానీ వీరికి చాన్సులు మాత్రం దక్కడంలేదు.


అందులో క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్ణవంశీ గురించి చెప్పుకోవాలి 1995లో గులాబీ నుంచి వెండి తెర మీద తనదైన టాలెంట్ చూపిస్తూనే ఉన్నాడు. మధ్యలో కొన్ని మూవీస్ ఫట్ ఐనా ఓ డైరెక్టర్ గా ఆయన్ని తక్కువ అంచనా వేయలేం . సరైన కధ చేతిలో పడితే ఇప్పటికీ వండర్స్ క్రియేట్ చేయగలరు. ఆయన చేతిలో ఇపుడు రెండు బ్రహ్మాండమైన స్క్రిప్టులు ఉన్నాయి. ఇద్దరి సీనియర్ టాప్ హీరోలు  ఆ మూవీస్ చేయాలని రాసుకున్న కధలవి.


అందులో ఒకటి  వందేమాతరం. అది మేగాస్టార్ చిరంజీవితో చేయాలని ఎప్పుడో ప్రకటించేశాడు  క్రిష్ణ వంశీ. అయితే ఎందుకో అది అలా లేట్ అవుతూ ఇప్పటికీ దశాబ్దం పైనే అవుతోంది. చిరు 152వ మూవీ కూడా కొరటాల శివతో కమిట్ ఐపోయాడు. 153వ మూవీ త్రివిక్రం తో ఉంటుంది. అంటే చిరు మరో రెండేళ్ళ వరకూ ఖాళీగా లేరు. మరి ఆ తరువాత అయినా క్రిష్ణ వంశీకి చాన్స్ ఉంటుందా అంటే చెప్పలేం
ఇక మరో కధ రైతు. దీన్ని బాలయ్య వందవ మూవీగా తీయాలని వంశీ అనుకున్నాడు.


అన్నీ అయినాక ఎందుకో వెనక్కు వెళ్ళిపోయింది. ఇక ఈ మూవీ ఎపుడు పట్టాలెక్కుతుందో ఎవరూ చెప్పలేరు. బాలయ్య ఇపుడు రెండు మూవీస్ కమిట్ అయి ఉన్నారు. ఒకటి కే ఎస్ రవికుమార్ తో , మరోకటి బోయపాటి శ్రీనుతో. ఈ రెండు మూవీస్ అయ్యేసరికి మరో ఏడాది ఇట్టే గడచిపోతుంది. ఆ తరువాత అయినా బాలయ్య వంశీ వైపు చూస్తాడా అంటే డౌటే. మరి చూడాలి క్రిష్ణ వంశీ కధలకు ఎపుడు ప్రాణం వస్తుందో.


మరింత సమాచారం తెలుసుకోండి: