'రంగస్థలం' వంటి భారీ బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత డైరెక్టర్ సుకుమార్ ఇండస్ట్రీలో ఇంకా బిజీ డైరెక్టర్ అయిపోతారని అందరూ అనుకున్నారు. అంతేకాకుండా రంగస్థలం సినిమా తర్వాత మహేష్ బాబుతో సినిమా ఎనౌన్స్ చేసి అందరికీ షాక్ ఇచ్చిన సుకుమార్ కి..ట్విట్టర్ వేదికగా మహేష్ బాబు సుకుమార్ తో సినిమా లేదని కొన్ని అనివార్య కారణాలవల్ల సినిమా చేయడం లేదని పేర్కొన్నారు.

Image result for mahesh babu sukumar

దీంతో చాలామంది సుకుమార్, మహేష్ బాబు మధ్య ఏదో జరిగిందని రకరకాల వార్తలు ఇండస్ట్రీలో వచ్చాయి. అయితే తాజాగా ఈ వార్తలకు మహేష్ బాబు ‘మహర్షి’ ప్రమోషన్ కార్యక్రమాల్లో చెక్ పెట్టారు. మహర్షి తర్వాత కామెడీ సినిమా చేయాలని అనిల్ రావిపూడి తో ఒప్పుకోవడం జరిగింది...సుకుమార్ గారు చెప్పిన కథ చాలా సీరియస్ కథ తో కూడిన సినిమా అని కాబట్టి ఆ ప్రాజెక్టు నుండి బయటకు వచ్చినట్లు క్లారిటీ ఇచ్చారు.

Image result for allu arjun mahesh babu

అయితే ప్రస్తుతం డైరెక్టర్ సుకుమార్ అల్లు అర్జున్ తో చేస్తున్న సినిమా గతంలో మహేష్ బాబుతో చేయాల్సిన సినిమా అని...మహేష్ స్థానంలో అల్లు అర్జున్ ప్రస్తుతం నటిస్తున్నారని ఫిలింనగర్ టాక్. గతంలో అల్లు అర్జున్ కెరీర్లో మర్చిపోలేని హిట్లు ఇచ్చిన డైరెక్టర్ సుకుమార్..ఈ సినిమాతో కూడా మరో హిట్ ఇవ్వడానికి శతవిధాల ప్రయత్నాలు చేస్తున్నట్లు...అల్లు అర్జున్ కోసం కొన్ని మార్పులు చేర్పులు చేసినట్లు ఫిల్మ్ నగర్ టాక్.



మరింత సమాచారం తెలుసుకోండి: