వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ తో ఎంట్రీ ఇచ్చి ఆ తరువాత  బిజీ అయిపోయి టాప్ గేర్ లో కెరీర్ ని పరుగులు పెట్టించిన గ్లామర్ భామ  రకుల్ ప్రీత్ సింగ్ ఇపుడు సెకండ్ ఇన్నింగ్స్ కోసం తెగ ట్రై చేస్తోంది. నాగార్జున మన్మధుడు 2 మూవీలో ఈ అమ్మడు జోడీగా నటిస్తోంది. నాగ్ తో రోమాన్స్ చేస్తోంది. మరో వైపు తమిళ్ మూవీస్ తో కూడా బిజీ అయింది. కొత్త ఆఫర్ల కోసం ఇన్స్టాగ్రాం లో హాట్ ఫోజులు ఇస్తున్న రకుల్ ఎలా అయినా టాలీవుడ్లో మళ్ళీ జెండా పాతేయాలనుకుంటోంది.


ఈ ముద్దు గుమ్మ కొన్ని విషయాల్లో బోల్డ్ గా మాట్లాడుతూ సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ప్రేమకు వయసులో సంబంధం లేదని, చిన్న వాడైన నచ్చితే రోమాన్స్ చేస్తాను,   పెళ్లి కూడా చేసుకుంటానని కూడా   అంటోంది. నచ్చిన వాడు దొరకాలే కానీ వెంటనే ప్రేమించి పెళ్ళాడేస్తానని చెప్పుకొస్తోంది.


ఇక రకుల్ గురించి కొన్ని రూమర్స్ బాగా స్ప్రెడ్ అవుతున్నాయి. ఆమె ఎపుడైతే ప్రేమ, పెళ్ళి టాపిక్ తెచ్చిందో ఆమెకు డీప్ గా   లవ్ ఎఫైర్ ఉందని గాసిప్స్ బాగా వస్తున్నాయి. టాలీవుడ్లో ఆరడుగుల పొడుగు హీరోతో రకుల్ డేటింగ్ లో ఉందని ఒకటే రూమర్లు ఓ రేంజిలో  చక్కర్లు కొడుతున్నాయి. ఇది ఎంతవరకు నిజమో కానీ రకుల్ ప్రేమ అంటూంటే మాత్రం అనుమానాలు అందరికీ వచ్చేస్తాయిగా మరి.


మరింత సమాచారం తెలుసుకోండి: