టాలీవుడ్ ఇపుడు ఓ వుడ్ కి తీసిపోవటంలేదు. మీటూ కాదు కానీ ఈ వీర  రసిక భాగోతాలన్ని ఒక్కటొక్కటిగా బయటపడుతున్నాయి. సినిమాల్లో అవకాశాలు అన్న వంక పెట్టుకుని అడ్డంగా శీలాన్ని దోచుకోవాలనుకుంటున్న కామాంధులు ఎక్కువైపోయారని బాధితుల  కధలు వింటే తెలుస్తోంది. అందరూ కాదు కానీ కొంతమంది మాత్రం టూ మచ్ గా బిహేవ్ చేస్తున్నారని నిన్నటి నటి సమీరారెడ్డి, ఇపుడు మరో సినీ సెలిబ్రిటీ చెబుతున్న మాటలు వింటే ఏంటి, ఎందుకు ఇలా  చేస్తున్నారు అనిపిస్తోంది.


ఈ మధ్యనే  నటి సమీరారెడ్డి మాట్లాడుతూ తనకు కూడా లైంగిక వేధింపుకు అప్పట్లో వచ్చాయని చెప్పింది. ఆమె తెలుగు, తమిళ్ మూవీస్ చేసింది. మరి ఎక్కడ ఆమెకు ఈ వేధింపులు వచ్చాయో తెలియదు ఇక, ఇపుడు సింగర్ ప్రణతి ఆచార్య కధ వింటే నిజంగా ఇంత నీచమా అనిపిస్తుంది. లేటేస్ట్ గా ఓ ఇంటర్వ్యూలో ప్రణతి మాట్లాడుతూ తనకు లైంగిక వేధింపులు ఎక్కువ అయ్యాయని చెప్పుకొచ్చింది.


ఓ సినీ దర్శకుడు తన సినిమాలో పాట పాడాలలంటే ఓ నైట్ తన పక్కలో పడుకోవాలని బ్యాడ్ గా మాట్లాడట. చెప్పుతో కొడతానంటూ తాను చెప్పి బయటకు వచ్చేశానని ప్రణతి తెలిపింది. తనకు అవకాశం ఇస్తానని తానే ఆ దర్శకుడు పిలిపించుకుని మరీ ఇలా చేయడం ఏంటని ప్రణతి ఆవేదన వ్యక్తం చేసింది. తాను అప్పట్లో ఇంటర్ చదువుతున్నానని, ఆ డైరెక్టర్ పెళ్ళి అయినవాడని, ఇలా వయసులో ఎంతో పెద్ద అయినా కూడా అసభ్యంగా బిహేవ్ చేశాడని ప్రణతి కళ్ళ నీళ్ల పర్యంతమైంది. మీటూ లో ఇలాంటి కన్నీటి కధలు మరెన్ని ఉన్నాయో .



మరింత సమాచారం తెలుసుకోండి: