ఎన్నో అంచనాల నడుమున సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి సినిమా ఈ రోజు విడుదల అయ్యింది. ఈ సినిమా మీద ఇప్పటికే అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. అలాగే మహేష్ కెరీర్ లో ఎప్పుడు లేని విధంగా హైయెస్ట్ థియేటర్లో విడుదల అయ్యింది. అయితే మహర్షి సినిమాకు అన్ని ఏరియాల నుంచి పాజిటివ్ రిపోర్ట్ వస్తుంది. వంశీ పైడిపల్లి  సినిమా ను మొదటి పార్ట్ ను వినోదాత్మకంగా, రెండవ అపార్ట్ ను ఎమోషనల్ గా తీర్చిదిగినట్లు అందరూ చెబుతున్నారు.


అయితే అన్నికంటే ముఖ్యంగా 'మహర్షి' కథ అద్భుతంగా ఉందనే టాక్ వినిపిస్తోంది. సినిమా చూసిన ఆడియన్స్ కొందరు తమ అభిప్రాయాలను ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ఆ వివరాలపై ఓ లుక్కేద్దాం. 1. మహర్షిలో ఇంత డెప్త్ ఊహించలేదు. వంశీ పైడిపల్లి అందించిన స్టోరీ మహేష్ బాబుకు ఓవర్ షాడోలా ఉంది. వండర్ ఫుల్ మూవీ. ఒక డైరెక్టర్ కథను నమ్మి తీసిన మూవీ మహర్షి. సినిమాలోని ప్రతి చిన్న క్యారెక్టర్ కూడా అద్భుతం అనేలా ఉంది. 


2. స్టోరీ నడిపించిన విధానం క్లాస్‌గా.. ఔట్ స్టాండింగ్ అనేలా ఉంది. ఎప్పటికీ గుర్తుండి పోయే ఒక జన్యూన్ మూవీ అందించినందుకు వంశీ పైడిపల్లికి థాంక్స్. ఇలాంటి మెసేజ్ ఓరియెంటెడ్ మూవీ చేసినందుకు మహేష్ బాబుపై గౌరవం మరింత పెరిగింది. 3. మహర్షి' ఫస్టాఫ్ యూత్, క్లాస్ ఆడియన్స్ మెచ్చే అంశాలతో ఉంది. సెకండాఫ్ మాస్ ఆడియన్స్ నచ్చడంతో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులు ఎమోషనల్ అయ్యేలా ఉంది. ఓవరల్‌గా ఇది ఫుల్ మీల్స్ మూవీ, బ్లాక్ బస్టర్ ఖాయం. మహేష్ బాబు నుంచి మరొక మంచి సినిమా వచ్చింది. మహేష్ బాబు అదరగొట్టాడు. వంశీ పైడిపల్లి సినిమాలోని క్యారెక్టర్లు డిజైన్ చేసిన విధానం బావుంది. అల్లరి నరేష్, పూజా హెగ్డే ఆకట్టుకున్నారు. వెన్నెల కిషోర్, రావు రమేష్ సూపర్బర్. డిఎస్సీ సంగీతం బావుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: