సూపర్ స్టార్ మహేష్, పూజా హెగ్దె హీరోయిన్స్ గా నటించిన మహర్షి సినిమా ఈరోజు రిలీజైంది. మొదటి షో నుండి ఈ సినిమా హిట్ టాక్ సొంతం చేసుకుంది. రన్ టైం ఎక్కువైంది అన్న మాట వినిపిస్తున్నా వంశీ పైడిపల్లి అనుకున్నది అనుకున్న విధంగా తెరకెక్కించడంలో సక్సెస్ అయ్యాడని చెప్పొచ్చు. ఇక సినిమాలో హీరో క్యారక్టరైజేషన్ కొత్తగా ఉంది. రిషి పాత్రలో సూపర్ స్టార్ మహేష్ తన సత్తా ఏంటో చూపించాడు.


సక్సెస్, ఫెయిల్యూర్ కు డిఫరెన్స్ చెప్పడంతోనే రిషి పాత్ర ఎంత స్ట్రాంగ్ గా ఉండబోతుందో చెప్పాడు డైరక్టర్. అదిరిపోయే డైలాగ్స్.. వాటికి స్కోప్ ఇచ్చే సన్నివేశాలు.. ఫన్ ఎలిమెంట్స్.. వాటితో పాటుగా ఎమోషనల్ సీన్స్ ఇలా అన్నిటి సమపాళ్లలో మహర్షి సినిమా తెరకెక్కించారు. మహర్షిలో మనం ఓ కొత్త మహేష్ ను చూడొచ్చు. మహేష్.. మహేష్.. మహేష్ మహర్షి అంతా మహేష్ మ్యాజిక్ లోనే ఉండిపోతారు.


మహేష్ ను అందర్ డైరక్టర్ స్టార్ అని ఎందుకు అంటారో మహర్షితో తెలిసింది. డైరక్టర్ రాసుకున్న పాత్రకు నూటికి నూరు పాళ్లు న్యాయం చేసేందుకు మహేష్ కృషి చేస్తాడు. ఇక మహర్షిలో మహేష్ నటన తన కెరియర్ లోనే ది బెస్ట్ అని చెప్పడంలో సందేహం లేదు. 3 వేరియేషన్స్ లో రిషి పాత్రలో మహేష్ స్టీల్ ది షో అని చెప్పొచ్చు. ఇక సినిమాలో అల్లరి నరేష్ కూడా బాగా చేశాడు.


మహేష్ కూడా అల్లరి నరేష్ పాత్రకు బాగా సపోర్ట్ ఇచ్చాడు. సినిమాలో రవి పాత్రలో నరేష్ మరోసారి తన ప్రతిభ చాటాడు. ప్రకాశ్ రాజ్ పాత్రలో కూడా దర్శకుడు బాగా తెరకెక్కించాడు. మొత్తానికి మహేష్ ఫ్యాన్స్ కోరుకునే అద్భుతమైన ట్రీట్ మహర్షితో నెరవేరింది. దర్శకులు ఎలాంటి పాత్ర సృష్టిస్తే దాన్ని మించి తాను నటించి చూపిస్తా అని సూపర్ స్టార్ మహేష్ మరోసారి ప్రూవ్ చేసుకున్నాడు.



మరింత సమాచారం తెలుసుకోండి: