సూపర్ స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్న మహేష్ బాబు పాతిక చిత్రాల హీరోగా టాలీవుడ్లో అంతెత్తుకు ఎదిగాడు. హిట్లూ ఫట్లూ  ఎన్ని ఉన్నా స్టార్ డమ్ ఎక్కడా  చెక్కుచెదరలేదు. తండ్రి క్రిష్ణలా ఎక్కువ సినిమాలు చేయకపోయినా అంతకు పదింతలు సరిపడ ఇమేజ్ ని సాధించాడు. మహేష్ సినిమా అంటే ఓ క్రేజ్.  లేటెస్ట్ గా వచ్చిన మహర్షి తో రికార్డుల మోత  మోగిస్తున్న మహేష్ ఎక్కడా తగ్గలేదనిపించుకున్నాడు.


గత సమ్మర్ లో వచ్చిన భరత్ అను నేను తో పెద్ద హిట్ కొట్టిన మహేష్ ఈసారి మరింత ఆకలిగా ముందుకు వచ్చాడు. నాన్ బాహుబలి రికార్డులు అన్నీ ఈ దెబ్బకు చిత్తు చేయాలని మహేష్ డిసైడ్ అయిపోయాడు. నిన్న రిలీజ్ తో అది నిజమేననిపిస్తోంది. స్ట్రాంగ్ కలెక్షన్లలో మహర్షి బాక్సాఫీస్ ని షేక్ చేస్తున్నాడు. 


ఇక సమ్మర్ కోసం వేయి కళ్ళతో వేచి ఉన్న జనానికి కూడా కూల్ కూల్ చేశాడు మహేష్. మహర్షి మూవీ టోటల్ గా పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది. మెసేజ్ అండర్ కరెంట్ గా  ఉంటూ తీసిన ఈ సినిమా వీకెండ్ క్లోజ్ అయ్యేటప్పటికి కళ్ళు చెదిరే కలెక్షన్లు కొల్లగొడుతుందని సినీ పండిట్స్ లెక్కలు వేస్తున్నారు. మరి వారి అంచనాలు నిజమవుతాయా. మహేష్ కొత్త రుషి గా టాలీవుడ్ కి దారి చూపుతాడా అన్నది వైట్ అండ్ సీ..


మరింత సమాచారం తెలుసుకోండి: