సినీజనంలో ఓ జంట హిట్ అయితే చాలు మళ్ళీ మళ్ళీ జోడీ కట్టించేస్తారు. గీతా గోవిందంతో దేవరకొండ విజయ్, రష్మిక జోడీ బంపర్ హిట్ కొట్టారు. అలాంటి ఇలాంటి సక్సెస్ కాదు, ఏకంగా వంద కోట్ల క్లబ్ లో విజయ్ ఈజీగా చేరిపోయాడు. ఆ తరువాత వచ్చిన మూవీస్ విజయ్ కి ఆ రేంజి హిట్లు ఇవ్వలేదు. అందుకే కసిగా విజయ్ ఇపుడు కొత్త మూవీ చేస్తున్నాడు. జూలైలో 26న విజయ్ బర్త్ డే టైమ్ లో వస్తున్న డియర్ కామ్రెడ్ మూవీ మీద మంచి అంచనాలు ఉన్నాయి.


ఈ మూవీలో విజయ్ కి జంటగా లక్కీ రష్మిక కనిపిస్తోంది. ఈ ఇద్దరి ఆన్ స్ర్కీన్ రొమాన్స్ మూవీకి పెద్ద ప్లస్ అంటున్నారు. హాట్ హాట్ రొమాన్స్ ఓ లెక్కల్లొ పండించేసారని అంటున్నారు. విజయ్ చిలిపితనం, రష్మిక గడుసైన సొగసు కలసి సెల్యూలాయిడ్ పై సాంగేసుకున్నాయని ఇన్సైడ్ టాక్. ఈ మూవీ పై విజయ్ రష్మిక ఎన్నోఅ ఆశలు పెట్టుకున్నారు. దాంతో ఇద్దరూ పోటా పోటీగా నటించారని అంటున్నారు.


ఈ మూవీటో టాప్ స్టార్ కావాలని విజయ్ ఆశిస్తున్నాడు, అలాగే రష్మిక నంబర్ వన్ ప్లేస్ కోసం గట్టిగా ట్రై చేస్తోంది. బంపర్ హిట్ పడితే టాలీవుడ్లో స్టార్ హీరోల పక్కన చాన్స్ కొట్టేయవచ్చునని రష్మిక చూస్తోంది. మొత్తానికి పోస్ట్ సమ్మర్ లో వస్తున్న డియర్ కామ్రెడ్ ఎటువంటి హిట్ కొడుతుందో చూడాలి. 


మరింత సమాచారం తెలుసుకోండి: