అమెక‌న్ కామెడీ పోర్న్ మూవీను కొద్దిగా మార్చి, ఇక్కడ రిమేక్ చేశారు. ఎవ‌రూ గెస్ చేయ‌నంతగా మూవీకు క‌మ‌ర్షియ‌ల్ ఎలిమెంట్స్‌ను యాడ్ చేసి, ప‌క్కా కామెడీ ఎంట‌ర్‌టైన్‌మెంట్ అంటూ తెగ క‌బుర్లు చెప్పాడు ఆ ద‌ర్శకుడు. త‌నే బాలీవుడ్ ద‌ర్శకుడు ఇంద్రకుమార్‌. ఈ డైరెక్టర్ రీసెంట్‌గా తెర‌కెక్కించిన ఫిల్మ్ గ్రాండ్‌మ‌స్తి. ఈ మూవీలో అంతా బూతు మాట‌ల‌తో, వ‌ల్గర్ చేష్టల‌తో మ‌రింత దిగ‌జారుడు త‌నంగా ఉంటుంది. మూవీను అంతా మంచి మ‌సాలా కంటెంట్‌తో నింపి, పోర్న్ ఫ్లేవ‌ర్‌ను త‌ల‌పించే విధంగా చిత్రీక‌రించాడు. మూవీ విడుద‌లై అన్ని చోట్ల నుండి విమ‌ర్శలు వ‌స్తున్నప్పటికీ, బాక్సాపీస్ వ‌ద్ద మాత్రం క‌లెక్షన్ల జోరు కొన‌సాగుతుంది. రిలీజ్ అయిన మూడు రోజుల‌కే దాదాపు న‌ల‌బై కోట్ల రూపాయ‌ల‌ను వ‌సూల్ చేసింది. 
ఈ మూవీలో వివేక్ ఒబెరాయ్‌, రితేష్ దేశ్‌ముఖ్‌, అప్తద్ శివ‌స‌దామి హీరోలుగా యాక్ట్ చేశారు.  ఈ మూవీ అచ్చు 1990లో వ‌చ్చిన అమెరిన్ కామెడీ పోర్న్ ఫిల్మ్ ను ఆధారం చేసుకొని తెర‌కెక్కించాడ‌ని కొంద‌రు అంటున్నారు. దానిక త‌గ్గ మూవీను కూడ విట్‌నెస్‌గా చూపుతున్నారు. ఒక‌ మూవీల‌లోని స్టోరి లైన్‌ను తీసి మ‌రో మూవీను తీయ‌వ‌చ్చు. కాని క‌థే దొర‌క‌నట్టు పోయి పోయి ఒక పోర్న్ మూవీను రిమేక్ చేసుకోవాల్సిన దుస్థితి ఈనాటి డైరెక్టర్లకు వ‌చ్చింది అంటూ ఇంద్రకుమార్ చేసిన ప‌నికి బాలీవుడ్ రైట‌ర్స్‌ అంద‌రూ తిట్టుకుంటున్నారంట‌.

మరింత సమాచారం తెలుసుకోండి: