Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Thu, Oct 24, 2019 | Last Updated 3:11 am IST

Menu &Sections

Search

మహేష్ మూసలో వెళుతున్నాడా...!

మహేష్ మూసలో వెళుతున్నాడా...!
మహేష్ మూసలో వెళుతున్నాడా...!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
సూపర్‌స్టార్ మహేష్ మూసలో వెళుతున్నాడా...ఒకే టైపు కథలతో బోరు కొట్టిస్తున్నాడా..ప్రస్తుతం మహర్షి సిన్మాను చూస్తే నిజమే అనిపిస్తుంది. మహర్షి సిన్మా చూస్తున్నప్పుడు మీకు కచ్చితంగా శ్రీమంతుడు, భరత్ అనే నేను సిన్మాలు గుర్తుకురాకపోతే అది మీ తప్పు కాదు. మహేష్ నటన కూడా ఇంచుమించు ఈ రెండు సిన్మాల్లో ఉన్నట్లే అనిపిస్తుంది. శ్రీమంతుడు సిన్మాలో మహేష్ మల్లీ మిలీయనీర్, భరత్ అనే నేనులో యుఎస్‌ నుంచి వచ్చి తండ్రి సీఎం కుర్చీలో కూర్చుంటాడు. ఇందులో కూడా మహేష్ రిచ్‌మ్యాన్‌గా కనిపిస్తాడు. ప్రస్తుతం మహర్షి సిన్మాలో కూడా అమెరికాలో సక్సెస్‌ఫుల్  బిజినెస్‌మ్యాన్‌గా ఉంటాడు.

భరత్ అనే నేను, మహర్షి సిన్మాల్లో విమానాలు, హెలికాఫ్టర్ల నుంచి మహేష్ తన దైన స్టైల్లో దిగేసి కార్లు ఎక్కుతుంటాడు. ఇక శ్రీమంతుడిలో భోగభగ్యాలు అన్నీ వదులుకుని , ప్రియురాలు చెప్పిందని ఆమె ఊరికి వెళ్లి, అక్కడ ప్రజల తరపున విలన్లతో పోరాడుతాడు. ఆ ఊరిని దత్తత తీసుకుని అక్కడ డెవలప్‌ చేస్తుంటాడు. ఇవన్నీ మళ్లీ తన తండ్రి డబ్బులే అని గమనించాలి. మహర్షిలో తన ఫ్రెండ్ అల్లరి నరేష్ కోసం ఇండియాకు వచ్చి , నరేష్ ఊరికి వెళ్లి అక్కడ కార్పొరేట్ జగపతి బాబుతో పోరాడుతాడు. ఇక్కడ సొంతంగా కష్టపడతాడా అంటే అదీ లేదు..తను బిజినెస్‌లో సంపాదించిన డబ్బులే ఖర్చుపెడతాడు. ఇక పాటలు కూడా డిటో దింపేశాడు.

శ్రీమంతుడులో దిమ్మతిరిగే దిమ్మతిరిగే అంటూ శృతితో ఆడితే, ఇక్కడ పాలపిట్ట అంటూ పూజాతో చిందేస్తాడు. ఈ రెండు పాటల్లో సెట్లు, డాన్స్‌ స్టెప్పులు ఒకేలా లేకపోయానా...ఒకేలా ఉన్నట్లు మీకు అనిపించడం ఖాయం. శ్రీమంతుడిలో చెరువు దగ్గర ఫైట్. మహర్షిలో కత్తి పట్టుకుని చేసే ఫైట్ ఒకేలా అనిపిస్తాయి. ఇక మహేష్ డైలాగులు, ఎక్స్‌ప్రెషెన్స్ అన్నీ గత సినిమాల్లోనేలాగానే ఉన్నాయి. కొత్తగా ఏం లేవు. ఎందుకో ముందు నుంచి మహేష్ ఒకే మూసలో వెళుతున్నట్లు అనిపిస్తుంది.  దూకుడు హిట్ అయిందని, అదే జానర్‌లో ఆగడు చేశాడు.అట్టర్ ఫ్లాప్ అయింది. పోకిరి తర్వాత అదే ఫార్మాట్‌లో అతిధి చేస్తే అడ్రస్ లేకుండా పోయింది. ఇప్పుడు శ్రీమంతుడు స్టైల్లో మహర్షి తీస్తే పెద్దగా వర్కవుడ్ అవడం లేదనే చెప్పాలి. 


గతంలో తివిక్రమ్ మహేష్‌ను దేవుడిలా చూపించి, ఖలేజా సిన్మాను చెడగొట్టినట్లే,  ఈ డైరెక్టర్లు కూడా  మహేష్‌ను దిగివచ్చిన కోటీశ్వరుడు, రాజకుమారుడు స్టైల్లో చూపిస్తూ మాస్ ప్రేక్షకుడికి దూరం చేస్తున్నట్లు అనిపిస్తుంది. గతంలో చూడండి మహేష్ ఒక్కడు సిన్మాలో మిడిల్ క్లాసు కుర్రోడిగా చాలా నేచురల్‌గా కనిపిస్తాడు. అది ఎంత పెద్ద మాస్ హిట్ అయిందో మనందరికి తెలుసు. అలాగే పోకిరిలో కూడా వీధిలో తిరుగుతూ రౌడీ మూకలతో గొడవపడే కుర్రోడిగా సిన్మా చివరి వరకు చూపించారు. ఆ సినిమా ఇండస్ట్రీ హిట్ అయింది.

ఇలా మాస్‌కు దగ్గరైన పాత్రలతో అలరించిన మహేష్ ఇప్పుడు మల్టీ మిలియనర్‌ పాత్రలతో ప్రేక్షకులతో పెద్దగా కనెక్ట్ కాలేకపోతున్నాడు. దీనికి నిదర్శనమే మహర్షి మూవీ. ఒక సినిమాను మాస్‌ ప్రేక్షకులకు నచ్చేలా తీయడం దర్శకులకు కత్తిమీద సాము. ఇక సందేశాత్మక సినిమాను మాస్ ప్రేక్షకులకు నచ్చేలా మ్యాజిక్ చేయడం కొరటాల శివ వంటి డైరెక్టర్‌కే సాధ్యమైంది. కొరటాల రూట్‌లో వంశీపైడిపల్లి కూడా కమర్షియల్ ఫార్మాట్‌లో సందేశాలు ఇవ్వడం బెడిసికొట్టింది. ఎందుకంటే అందరూ కొరటాల శివలాగా హ్యాండిల్ చేయలేరు కదా..ఇక మహేష్ గురించి వద్దాం..


ఇకనైనా మహేష్ ఈ మల్లీ మిలీయనర్ కథలు వదిలేసి ఢిఫరెంట్ జానర్‌లో ట్రై చేస్తే బెటర్. మళ్లీ ఇదే ఫార్మాట్‌లో సిన్మా తీస్తే ప్రేక్షకులు మొనాటినీ ఫీల్ అయ్యే అవకాశం ఉంది. ఇక నుంచి మహేష్ ఈ జానర్ వదిలేసి ఢిఫరెంట్ స్టోరీలు, విభిన్నమైన క్యారెక్టర్లు చేస్తే అన్నీ వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటాడు. కాస్త ఆలోచించు మహేష్.


superstar-mahesh-babu
5/ 5 - (1 votes)
Add To Favourite
About the author

Im interested in writing articles.