డైరెక్టర్ గా మురగదాస్ కు చాలా మంచి పేరు ఉంది. తను అనుకున్న కథను తెరపై అద్భుతంగా చూపిస్తాడని, హీరోయిజాన్ని బాగా ఎలివేట్ చేస్తాడని అటు తమిళ్, ఇటు తెలుగు ఇండస్ట్రీలలో హీరోలకి, నిర్మాతలకి ఎంతో నమ్మకం. ఆ నమ్మకాన్ని ఏమాత్రం పోగొట్టుకోకుండా మిగతా దర్శకుల కంటే డిఫ్రెంట్‌గా కథలను ఎంచుకుంటాడు. ముఖ్యంగా తమిళ్ లో "రమణ" మురగదాస్ కి ఎంతో పేరు తెచ్చిపెట్టింది. అదే సినిమాని తెలుగులో మెగాస్టార్ చిరంజీవి-వి.వి.వినాయక్ కాంబినేషన్‌లో "ఠాగూర్" గా వచ్చి సెన్షేషన్స్ ని క్రియేట్ చేసింది. 


ఇక మురగదాస్-సూర్య కాంబినేషన్ లో వచ్చిన "గజని" అయితే తమిళంలో ఒక సంచలనం సృష్ఠించింది. అంతేకాదు ఇదే సినిమాను తెలుగులో డబ్ చేయగా ఇక్కడ కూడా అద్భుతమైన కలెక్షన్లను రాబట్టింది. ఈ సినిమాతో అటు కోలీవుడ్ ఇటు టాలీవుడ్ లో సూర్య కి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోయింది. ఇదే సినిమాని మురగదాస్ హిందీలోను తెరకెక్కించాడు. అమీర్ ఖాన్ తో హిందీలో కూడా గజిని పేరుతో రూపొందించి బాలీవుడ్ లోను హిట్ కొట్టాడు. 


అయితే ఇదే సినిమా తమిళ వర్షన్ లో ఆసిన్, నయనతార హీరోయిన్లుగా నటించారు. అయితే మురగదాస్ నయన తారకు కథ చెప్పినప్పుడు చెప్పిందొకటి ఆ తర్వాత చేసిందొకటని నయనతార తెగ బాధ పడిందట. అంతేకాదు ఈ సినిమా తనకు ఒక పాఠం అని...మురగదాస్ వల్ల చాలా నేర్చుకున్నానని తన సన్నిహితుల దగ్గర చెప్పుకుందట. అయితే అదే తనకు ఆ తర్వాత కథల ఎంపిక విషయంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలనే అనుభవాన్ని నేర్పిందట.



మరింత సమాచారం తెలుసుకోండి: