టాలీవుడ్లో ఎవరి సినిమా వారు చేసుకుంటారు. కానీ ఒక్కోసారి క్లాష్ వస్తుంది. అపుడు చూడాలి ట్రబుల్ అలా ఇలా ఉండదు. కొందరికి కొన్ని సెంటిమెంట్స్ ఉంటాయి. వాటిని నమ్ముకుని ముందుకు సాగుతారు. అసలు సినిమా ఇండస్ట్రీ అంటేనే సెంటిమెంట్లకు నిలయం, అందువల్ల దానికే ఓటేస్తారు. ఇపుడు అదే జరుగుతోంది. రెండు పెద్ద సినిమాలు ఇపుడు గొప్ప టెన్షన్  పెడుతున్నాయి.


అందులో ఒకటి మెగాస్టార్ నటిస్తున్న సైరా  మూవీ. రెండవది ప్రభాస్ సాహో. ఈ రెండు మూవీస్ స్టార్ట్ అయి చాలా కాలమే అయింది. అయితే రిలీజ్ ఎపుడు అంటే చెప్పడం కష్టమే. సైరా ఈ సంక్రాంతి అన్నారు. తరువాత  సమ్మర్ అన్నారు. ఆగస్ట్ అన్నారు. ఇపుడు దసరా వద్ద ఆగింది. తేడా వస్తే 2020 సంక్రాంతి అంటున్నారు.  


అలాగే సాహో ఎన్నో డేట్స్  మారి ఆగస్ట్ రిలీజ్ అంటున్నారు. అయితే అది కూడా నమ్మకం లేదు. అటూ ఇటూ సాగదీసి దసరాకు తెస్తారా అన్నది డౌట్. అదే జరిగితే సైరా మూవీ కూడా సంక్రాంతి వరకూ జరుగుతుంది. అపుడు సంక్రాంతి పెద్ద సినిమాలకు దెబ్బేనని రేసులో ఆల్రెడీ  ఫిక్స్ అయిన వారు కంగారు పడుతున్నారు. ఇప్పటికి చూస్తే నాగార్జున, మహేష్ బాబు, బాలక్రిష్ణ సంక్రాంతికి కర్చీఫ్ వేసేశారు. సైరా వస్తే ఇపుడు మొత్తం రిలీజ్ లే గందరగోళంలో పడతాయి. ఏమవుతుందో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: