సూపర్ స్టార్ మహేష్ మహర్షి సినిమా గురువారం రిలీజైంది. ఈ సినిమా చూసిన ఫ్యాన్స్ కాలర్ ఎగురవేసుకుంటూ ఇదిరా మ మహేష్ అంటే అనుకుంటుంటే.. కొందరు మాత్రం ఏముంది సినిమాలో సినిమా శ్రీమంతుడు సీక్వలే కదా అంటున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. అసలు శ్రీమంతుడు కథ వేరు మహర్షి కథ వేరు.. రెండిటిని ఎలా ఒక దగ్గరకు చేరుస్తారు అంటూ మహేష్ ఫ్యాన్స్ వాదన పెట్టుకుంటున్నారు.


స్టార్ హీరో సినిమాకు నెగటివ్ పబ్లిసిటీ చేయడం కామనే.. కాని మహర్షికి వెరైటీగా శ్రీమంతుడు సినిమాతో లింక్ పెట్టడం జరుగుతుంది. అసలు శ్రీమంతుడు కథ విలేజ్ అడాప్షన్.. అది కూడా ఆ ఊరు నుండి వెలివేయబడిన ఓ తండ్రి గతాన్ని తెలుసుకుని ఆ ఊరు బాగుచేద్దామనే కలతో వచ్చిన కొడుకు కథ. ఆ కథకు అందరు బాగా కనెక్ట్ అయ్యారు. అది కొరటాల శివ డైరక్షన్ లో వచ్చిన సినిమా.   


ఇక ఇప్పుడు మహర్షి సినిమా విషయానికి వస్తే.. ఫస్ట్ హాఫ్ మొత్తం కాలేజ్ బ్యాక్ డ్రాప్ లో వెళ్తుంది.. సెకండ్ హాఫ్ మాత్రం రామవరం అనే విలేజ్ లో నడుస్తుంది. రైతు కష్టాల గురించి మహేష్ చెప్పే డైలాగ్స్ అద్భుతంగా ఉంటాయి. అయితే ఇక్కడే అసలు పాయింట్ ఉంది శ్రీమంతుడు సినిమాలో మహేష్ ఊరు జనాలందరు సిటీకి వెళ్తుంటే వారిని ఆపేందుకు ఊరిని డెవలప్ చేయాలని చూస్తాడు. కాని మహర్షిలో సక్సెస్ మంత్రగా ఉండే రిషి తన జర్నీలో తాను గెలుస్తూ మిగతా వాళ్లను ఓడిపోయేలా చేస్తాడు.  


అందుకే ఆ విషయాన్ని తెలుసుకుని తన ఫ్రెండ్ రవికి కావాల్సిన పని సాధించేందుకు న్యూయార్క్ నుండి రామవరం షిఫ్ట్ అవుతాడు. శ్రీమంతుడు, మహర్షి రెండు సినిమాల్లో హీరో మహేష్ కాబట్టి కామన్ ఆడియెన్ కు అలా అనిపించడంలో తప్పు లేదు. ఆ కథకు ఈ కథకు చాలా డిఫరెన్స్ ఉంది. మహర్షికి కనెక్ట్ అయిన వారు ఆ మాట అనలేరు కాని కొందరు మాత్రం రన్ టైం ఎక్కువైందని.. శ్రీమంతుడు 2 అని ఏదో ఒకటి అంటూనే ఉంటారు. సినిమాను సినిమాగా చూడకుండా ఇది ఆ సినిమాకు సీక్వల్.. లేదా సూపర్ హిట్ సినిమాల మిక్సర్ అంటూ ఇలా చవకబారిన కామెంట్స్ చేయడం కూడా కరెక్ట్ కాదనుకుంటా. 


మరింత సమాచారం తెలుసుకోండి: