సూపర్ స్టార్ మహేష్ కథానాయకుడిగా నటించిన మహర్షి ఇటీవలే రిలీజై రికార్డ్ స్థాయిలో కలెక్షన్ల సునామీని సృష్టిస్తోంది. ఇక ఈ సోమవారం నుంచి "మహర్షి' వసూళ్ళు ఏ రేంజ్ లో ఉంటాయో అన్న ఆసక్తి అందరిలోను ఉంది. ఇదిలా ఉండగానే మహేష్ నటించే 26వ సినిమా ఎలా ఉండబోతోంది? ఆ సినిమా కథాంశం ఏంటి?  హీరోయిన్ గా ఎవరిని ఎంపిక చేసుకున్నారు? "ఎఫ్ 2" తో వెంకటేష్-వరుణ్ తేజ్ ని 100 కోట్ల క్లబ్ లో చేర్చిన అనీల్ రావిపూడి మరోసారి ఎఫ్ 2 లాంటి బ్లాక్ బస్టర్ ని తీస్తాడా? అంటూ ఒకటే ఎగ్జయిట్ మెంట్ మహేష్ అభిమానుల్లో కనిపిస్తోంది.


ఇక లేటెస్ట్ అప్‌డేట్ ఏంటంటే..అనీల్ రావిపూడి, మహేష్ తో ఎఫ్ 2 రేంజు కామెడీ ఎంటర్ టైనర్ ని తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నాడని సమాచారం. అంతే కాదు ఈ సినిమా అంతా కూడా విలేజ్ బ్యాగ్డ్రాప్ లో ఉండబోతోందట. మహేష్ కెరియర్ లో "దూకుడు" ఎలాంటి సినిమానో ఇప్పుడు అనీల్ తీయబోయే సినిమా అదే తరహా అని ప్రచారం సాగుతోంది.


ఈ సినిమాలో లేడీ సూపర్ స్టార్ విజయశాంతి, సూపర్ స్టార్ మహేష్ కి అత్త పాత్రలో నటించనున్నారు. అందుకోసం స్టార్ హీరోయిన్ రేంజ్ లో పారితోషికం ఇవ్వనున్నారట. ఒకప్పుడు విజయశాంతి `అత్తకు యముడు అమ్మాయికి మొగుడు` సినిమాలో అత్త కూతురుగా నటించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మహేష్ కి అత్తగా నటించబోతుండటంతో ఆ క్యారెక్టర్ ఎలా ఉండబోతోందన్న క్యూరియాసిటీ మహేష్ ఫ్యాన్స్ లో తెగ పెరిగిపోతోంది. ఇక ఈ సినిమా జూన్ 3వ వారం నుంచి సెట్స్ పైకి వెళ్లనుందని లేటేస్ట్ న్యూస్.


మరింత సమాచారం తెలుసుకోండి: