బాహుబలి ఇంటర్నేషనల్ వైడ్ హిట్ తరువాత రాజమౌళి తీస్తున్న చిత్రం RRR. ఈ చిత్రం లేటెస్ట్ అప్డేట్లు ఏప్పుడుకప్పుడు ట్రేండింగ్ లో ఉన్నాయి. ఈ సినిమాకు ఏంతో మంది నటీనటులు నటించడానికి పోటి పడినా రాజమౌళి మాత్రం చాల సెలెక్టెడ్ గా నటీనటుల ఎంపిక చేసారు. అయితే బాలీవుడ్ యంగ్ టాలెంటెడ్ హీరోయిన్ అయిన అలియాభట్ అవకాసం అడిగి మరీ రాజమౌళి సినిమాలో నటించే ఛాన్స్ సంపాదించింది.


రాజమౌళికి అలియా భట్ అంటే అభిమానం ఉందట, కాఫీ విత్ కరణ్ షో లో కూడా తన అభిమాన బాలీవుడ్ హీరోయిన్ ఇప్పుడు ఉన్న యంగ్ జనరేషన్ లో అలియానే అని సమాధానమిచ్చారట రాజమౌళి. బహుశా ఏవరు అడిగిన ఆలోచించే రాజమౌళి అలియా భాట్ తనకు తానుగా రిక్వెస్ట్ చేయడంతో ఆలోచించకుండా రోల్ ఇచ్చారని టాక్.

Image result for rajamouli images

అలియా భట్ అంటే దర్శకులందరికి హాట్ ఫేవరేట్. యూత్ లో ఆమెకు చాల క్రేజ్ ఉంది. అందుకని ఆమెకు చిన్న పాత్ర ఇస్తే తన టాలెంట్ ని అవమానించినట్లు ఉంటుందని, రాజమౌళి అలియా కోసం ఒక పాత్రని పోడిగించాడట. RRRలో రామ్ చరణ్ తో పాటు జూనియర్ ఎన్టీఆర్ కూడా నటిస్తున్నాడు.


ఈ సినిమా ఇంకా సెట్స్ మీదే ఉంది. రాజమౌళి సినిమా అంటే కనీసం ఒక సంవత్సర కాలం నుండి రెండు సంవత్సరాలైన పట్టి తీరుతుందని ప్రేక్షకులందరికి తెలిసిన విషయమే. అయితే అభిమానులు షూటింగ్ అప్ డేట్లతో తమ అభిమాన హీరో, డైరెక్టర్ సినిమా ఏప్పుడెప్పుడు వస్తుందా అని ఆసక్తిగా ఏదురు చూస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: