టాలీవుడ్ లో అక్కినేని ఫ్యామిలీ నుంచి వచ్చిన నాగార్జున ‘శివ’తర్వాత ఎక్కువగా యాక్షన్ తరహా సినిమాల్టో నటించారు.  ఆ తర్వాత ఫ్యామిలీ నేపథ్యంలో నటించారు..సంతోషం, మన్మథుడు లాంటి సినిమాలు రెండు విభిన్న పాత్రల్లో నటించారు.  మన్మథుడు సినిమాలో భగ్న ప్రేమికుడికి కోపం వచ్చి అమ్మాయిలు అందరూ మోసం చేసేవారని నమ్మే క్యారెక్టర్ లో నటించారు. ఈ సినిమాలో లవ్, సెంటిమెంట్, కడుపుబ్బా నవ్వించే కామెడీ అన్నీ ఉన్నాయి.  అప్పట్లో ఈ సినిమా సీక్వెల్ తీయాలని అప్పట్లో అనుకున్నారు..కానీ కుదరలేదు.  


తాజాగా రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో నాగార్జున హీరోగా ఈ సినిమాలో సమంత ఒక ముఖ్యమైన పాత్రను పోషిస్తున్నట్టుగా వార్తలు వచ్చాయి. దాంతో ఆమె పాత్ర ఎలా వుండనుందనే ఆసక్తి అందరిలోను తలెత్తుతోంది. ఈ సినిమాలో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లోకి తీసుకెళ్లే పాత్రలో ఆమె కనిపించనుందనేది తాజా సమాచారం. 


మన్మథుడు సినిమాలో నాగార్జున ఫ్లాష్ బ్యాక్ తనికెళ్ల భరణి చెబుతాడు..అయితే ఈ సినిమాలో నాగార్జున బ్యాగ్ గ్రౌండ్ సమంత చెబుతుందని సమాచారం.మన్మథుడు 2'లో కథానాయకుడు అమ్మాయిలతో మాత్రమే చనువుగా ఉంటాడట. అందుకు కారణమేమిటనేది సమంత చెబుతుందని అంటున్నారు. 'మన్మథుడు' భారీ విజయాన్ని సాధించిన కారణంగా, సహజంగానే 'మన్మథుడు 2' పై అంచనాలు వున్నాయి. 


మరింత సమాచారం తెలుసుకోండి: