'అర్జున్ రెడ్డి' లాంటి బోల్డ్ కంటెంట్ ఉన్న సినిమాను రీమేక్ చేయడం అంటే సాహసమే. పైగా 'అర్జున్ రెడ్డి' లో విజయ్ దేవరకొండ నటన ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇంతవరకు ఏ హీరో చేయలేదనే అనే స్థాయిలో ఉండడంతో ఆ క్యారెక్టర్ ను రీమేక్ లో పోషించడం ఎలాంటి నటుడికైనా కష్టమైన విషయమే.  ఎందుకంటే.. ఎంత కష్టపడి నటించినా.. ఆఖరికి విజయ్ తో కంపేర్ చేస్తారు.  అయితే అలాంటి ఛాలెంజ్ ను స్వీకరించాడు బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్.


ఈ సినిమాకు 'అర్జున్ రెడ్డి' దర్శకుడు సందీప్ వంగా స్వయంగా దర్శకత్వం వహించడం షాహిద్ కు ఎంతో ప్లస్. అయితే ఈ క్యారెక్టర్ కోసం ఎంత ఎఫర్ట్ పెట్టినప్పటికీ సౌత్ లో షాహిద్ ఫ్యాన్స్ మాత్రం ఒరిజినల్ తో పోలుస్తారని తెలుసు కాబట్టే ముందు జాగ్రత్తగా షాహిద్ 'కబీర్ సింగ్' ను ఓపెన్ మైండ్ తో చూడమని కోరుతున్నాడు. 
ఇక హిందీలో ఈ సినిమా నేపథ్యం ఢిల్లీకి మారుతుందని.. దానికి తగ్గట్టే కొన్ని మార్పులు ఉన్నాయని చెప్పాడు సందీప్. రీమేక్ లో హీరో పంజాబ్ నుంచి వచ్చిన వ్యక్తి కావడంతో టైటిల్ ను 'కబీర్ సింగ్' అని పెట్టామని చెప్పాడు.  ఈ టైటిల్ ను సూచించింది దర్శకుడు సందీపేనట.


ఇక తెలుగులో విజయ్ దేవరకొండను, హిందీలో షాహిద్ ను డైరెక్ట్ చేసిన సందీప్ ఈ క్యారెక్టర్ ను ఇద్దరు బాగా చేశారని...ఒకరిని ఒకరితో కంపేర్ చేయ లేమని టాలీవుడ్‌లో విజయ్ బెస్ట్ అయితే బాలీవుడ్‌లో షాహిద్ బెస్ట్ అని చెప్పాడు. మరి బాలీవుడ్‌లో ఈ సినిమా రిలీజైతే గాని ఎవరు బెస్టో తెలుస్తుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: