ప్రణీత హీరోయిన్ మీకు గుర్తే ఉండి ఉంటుంది. పవన్ సరసన 'అత్తారింటికి దారేది'లో ఒక హీరోయిన్ గా నటించడమే కాకుండా 'బాపు గారి బొమ్మ' సాంగ్ లో పవన్ తో కలిసి స్టెప్పులు వేయడంతో నిజంగా బాపుబొమ్మ కాకపోయినా బాపుబొమ్మ అయిపోయింది. తాజాగా ఈ భామా ప్రోవోక్ లైఫ్ స్టైల్ మ్యాగజైన్ కవర్ పేజిపై మెరిసింది.  మే నెల ఎడిషన్లో ప్రణీతపై "మీరు బంధనాలను తెంచుకోవాలంటే రెబెల్ అయి ఉండాల్సిన పని లేదు" అనే టైటిల్ తో ఒక పెద్ద కథనం కూడా ప్రచురించారు.


  కవర్ పేజిపై కలర్ఫుల్ గానే ఉన్న ప్రణీత లోపలి పేజీల్లో మాత్రం తన అందాలను ధారపోసింది. స్విమ్మింగ్ పూల్ లో ఈత కొడుతూ జలకన్యలా మారిపోయి నెటిజనుల వేడిని పెంచే కార్యక్రమం చేపట్టింది. జస్ట్ బికిని అంటే రొటీన్ గా ఉంటుందని అనుకుందేమో కానీ పారదర్శకంగా ఉండే డ్రెస్ లాంటి బికినీని ధరించింది.  ఒక ఫోటోలో జుట్టును ఫ్లిప్ చేస్తూ ఉన్నప్పుడు నీళ్ళు ఒక ధారగా పడతాయి.. కదా అలాంటిది.


  ఆ ఫోటో టైమింగ్ అయితే సూపరో సూపర్. ఇలా రెచ్చిపోయి మరీ పోజులు ఇవ్వడంతో ఫోటోలకు సోషల్ మీడియాలో స్పందన మామూలుగాలేదు.  ఇటు ట్విట్టర్ లోనూ.. అటు ఇన్స్టాలోనూ నెటిజనులు లైకులు కొట్టడమే పనిగా పెట్టుకున్నారు.  ప్రణిత సుభాష్ ఫ్యూచర్ ప్రాజెక్టుల విషయానికి వస్తే ప్రణీత కన్నడ చిత్రం 'రమణ కుమార' లో నటిస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: