ఒక‌ప్ప‌టి నంబ‌ర్ వ‌న్ టాప్ హీరో మెగాస్టార్ చిరంజీవి పై త‌మ్మారెడ్డి భ‌ర‌ద్వ‌జ్ త‌న‌ అభిప్రాయాలు వెల్ల‌డించారు.  ఒక‌ప్పుడు ఎంతో స్వ‌యంకృషితో తెలుగు ఇండ‌స్ట్రీలో నెంబ‌ర్ ఒన్ స్థానంలో ఉన్న ఆయ‌న రాజ‌కియాల్లోకి వ‌చ్చారు. ప్ర‌జారాజ్యం అనే పార్టీని స్థాపించి దాన్ని కొద్ది రోజులు కూడా స‌క్ర‌మంగా న‌డ‌ప‌కుండా ఆయ‌న‌కు ఉన్న గౌర‌వానికి దూర‌మ‌య్యార‌ని అన్నారు. ఇక ఆయ‌న సినీ జీవితానికి వ‌స్తే ఇండ‌స్ట్రీలో ఎవ‌రూ క‌ష్ట‌ప‌డ‌నంత‌గా ఆయ‌న క‌ష్ట‌ప‌డి మంచి స్థానాన్ని సంపాదించార‌ని అన్నారు.

సినిమాల వ‌ర‌కు ఆయ‌న ఆలోచ‌న‌లు  క‌రెక్ట్‌గానే ఉంటాయ‌ని ఆయ‌న అంత‌వ‌ర‌కే ఆలోచించ‌ల‌ర‌ని అన్నారు. రాజ‌కీయాల గురించి ఆలోచించే అంత శ‌క్తి లేద‌ని ఆయ‌న అభిప్రాయ‌ప‌డ్డారు. ఆయ‌న‌కు రాజ‌కియాల మీద స్వంతంగా ఆలోచించ‌లేరు వూనూ వారి పై ఆధార‌ప‌డ‌తార‌న్నారు.


రాజకీయాల్లోకి వచ్చేవాళ్లు తమంతట తాము ఆలోచించుకుని రావాలని, ఈ లక్షణం చిరంజీవిలో లేదన్న ఉద్దేశంతోనే తాను గతంలో చిరంజీవి రాజకీయాలకు పనికిరాడని వ్యాఖ్యానించానని తమ్మారెడ్డి వివరణ ఇచ్చారు. రాజ‌కీయాల్లో ఏదైనా ఒక విష‌యం పై కీల‌క నిర్ణ‌యాలు తీసుకోవాల్సిన అవ‌స‌రం వ‌చ్చిన‌ప్పుడు స్వంతంగా తీసుకోగ‌లిగే స‌త్తా ఉండ‌డం ఎంతో మంచిద‌న్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: