మెగా మేనళ్లుడు సాయిధరమ్ తేజ్ ‘పిల్లా నువ్వు లేని జీవితం’ సినిమాతో హీరోగా తన ప్రస్థానం మొదలు పెట్టాడు.  ఈ సినిమా సూపర్ హిట్ అయ్యింది.  వెంటనే సుబ్రమణ్యం ఫర్ సేల్ కూడా సూప్ హిట్ అయ్యింది.  ఆ తర్వాత సుప్రీమ్ సినిమా కూడా మరో విజయం అందుకుంది..దాంతో ఈ హీరోకి ఇక తిరుగు లేదని అనుకుంటున్న సమయంలో వరుసగా ఆరు సినిమాలు అట్టర్ ఫ్లాప్ అయ్యాయి.  దాంతో సాయిధరమ్ కెరీర్ కష్టాల్లో పడింది. 


వరుస ఫ్లాప్‌లతో కష్టాల్లో ఉన్న సుప్రీం హీరో సాయి తేజ్‌ చిత్రలహరి చిత్రంతో కాస్త ఒడ్డున పడినట్లే కనపడుతున్నాడు.   ఈ సినిమా విషయంలో ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలో అన్ని తీసుకున్నాడు.  ఈ సినిమాలో తండ్రి కొడుకు ల మద్య సెంటిమెంట్..ఓ యువకుడు సమాజంలో ఎలా కష్టాలు పడి తన గోల్ చేరుకున్నాడు అనే కాన్సెప్ట్ ఆడియాన్స్ బాగనే కనెక్ట్ అయ్యారు. 


తనకు వరుసగా ఫ్లాపులు వస్తున్నాయని సక్సెస్‌ కోసం సెంటిమెంట్‌లను కూడా ఫాలో అయ్యాడు.   తన పేరును సాయి తేజ్‌  అని వేసుకున్నాడు ఈ మెగా హీరో.  ఏప్రియల్ 12న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మువీ కలెక్షన్స్ నాట్ బ్యాడ్ అనిపించుకున్నాయి.  14.57 కోట్లు వరకూ కలెక్షన్స్ రాబట్టింది. గుంటూరు, కృష్ణా మినహా అన్ని చోట్లా ఈ సినిమా లాభాలు తెచ్చి పెట్టింది. సాయి కెరీర్ లో ఎబోవ్ యావరేజ్ చిత్రంగా నిలిచింది. 


నైజాం.................... రూ8.6కోట్లు

సీడెడ్..................... రూ.2.18కోట్లు 

కృష్ణా...................... రూ.0.82కోట్లు 

గుంటూరు.............. రూ.0.98కోట్లు 

నెల్లూరు................ రూ.0.50కోట్లు 

వెస్ట్....................... రూ.0.78 కోట్లు

ఈస్ట్...................... రూ1.01 కోట్లు

ఉత్తరాంధ్ర........... రూ.1.90 కోట్లు


 ఆంధ్రా/తెలంగాణా...... 12.57 కోట్లు

దేశ వ్యాప్తంగా మిగతా ప్రాంత్రాలు... 1.0 కోట్లు

ఓవర్ సీస్...............................  1.0 కోట్లు

ప్రపంచవ్యాప్తంగా................... 14.57 కోట్లు






మరింత సమాచారం తెలుసుకోండి: