ఇన్నాళ్లు ఒక హీరోయిన్ గా సినిమా ఇండస్ట్రీలో నిల‌బ‌డ‌టం వెనుక త‌న అంకితభావ‌మేన‌ని అంటోంది వెండితెర జాబిలి కాజ‌ల్ అగ‌ర్వాల్. సుదీర్ఘ అనుభ‌వం, పేరు సంపాదించుకున్నాను కాబ‌ట్టి ఇక‌పై ప్ర‌తి సినిమా ఎంచుకునే ముందు మ‌రింత జాగ్ర‌త్తగా వ్య‌వ‌హ‌రిస్తాన‌ని అన్నారు. మొత్తం త‌న న‌ట ప్ర‌యా ణంలో మూడొంతుల విజ‌యాలు అందుకోవ‌డం ఈ అందాల తార ప్ర‌త్యేక‌త‌.. 


తెలుగు, త‌మిళంలో అగ్ర క‌థానాయ‌కులు అంద‌రితోను న‌టించింది. వాణిజ్య విలువ‌ల చిత్రాల‌తో సాగిపోయినా.. ప్ర‌తిభ చూపించే పాత్ర‌ల్లో మెప్పించినా.. అన్నింటిని కాజ‌ల్ స‌మానంగా చేసుకుంటూ వ‌చ్చింది.  ప్ర‌వాహంలా సాగే ఇండ‌స్ట్రీలో కొత్త హీరోయిన్ల పోటీ ఎప్ప‌టికీ ఉంటుంద‌ని,  ఎవ‌రి అవ‌కాశాలు వారికి వ‌స్తాయ‌ని అన్నారు. 


సినీ ఇండ‌స్ట్రీలో ప్ర‌తి ఒక్క‌రికీ కావాల్సిన‌న్ని అవ‌కాశాలున్నాయని అన్నారు. ఇదో స‌ముద్రమ‌న్నారు. ఇక్క‌డ ఎవ‌రికి రావాల్సిన సినిమాలు వారికి దొరుకుతాయ‌న్న కాజ‌ల్.. మారుతున్న ప‌రిస్థితుల‌కు అనుగుణంగా న‌న్ను నేను మెరుగుప‌ర్చుకునేందుకు ఎప్పుడూ ప్ర‌య‌త్నిస్తుంటాన‌ని చెప్పుకొచ్చారు.


మరింత సమాచారం తెలుసుకోండి: