ఫలక్నుమా దాస్ ట్రైలర్ రిలీజ్ అయిన నాలుగు గంటల్లోనే మూడు లక్షల వ్యూస్ ని సంపాదించింది. నాలుగు నెలల క్రితం రిలీజ్ అయిన టీజర్ తో అందరిని తన హైదెరాబాదీ యాస, మాస్ ఎలిమెంట్స్, పిచ్చెక్కిచ్చే మ్యూజిక్ తో ఆకట్టుకున్న హీరో అండ్ డైరెక్టర్ విశ్వక్ సేన్, ట్రైలర్ లో మాస్ హవా తగ్గకుండా, స్టోరీ ని చక్కగా పరిచయం చేసి, యూత్ ని మరింత ఆక్కట్టుకున్నాడు.


దాస్ చిన్నతనం నుంచి, పెద్ద దందాలు చేసే లీడర్ గా ఎదిగే క్రమాన్ని చక్కగా చూపించారు ట్రైలర్ లో. ములాయం సినిమా 'అంగమలై డైరీస్' రీమేక్ అయిన ఫలక్నుమా దాస్, ఆరంభం లో కొంత నెగటివ్ రియాక్షన్స్ ని చూడాల్సివచ్చింది. అంగమలై డైరీస్ లో ఉన్న నేటివిటీ ని ఎలా తెలుగు లోకి అనువదిస్తారు అనే దానిపై పలు అనుమానాలు వ్యక్తం చేసారు సినీ ప్రేమికులు.  ఆ అనుమానాలన్నిటిని పటాపంచలు చేస్తూ, వీడు పక్క 'హైదెరాబాదీ కుర్రాడు' రా అనిపించున్నాడు దాస్. 'అంగమలై డైరీస్' లో పందుల బిజినెస్ ని 'మటన్' బిజినెస్ గా మర్చి తెలుగు ఆడియన్స్ కి కావల్సిని అని కమర్షియల్ ఎలిమెంట్స్ ని జత చేసి మంచి ప్యాకేజీ అందించాడు విశ్వక్ సేన్.


కదా మొత్తం ఒక 'బోటి కర్రీ' వల్ల మారిపోయే పాయింట్ యూత్ కి తెగ కనెక్ట్ అయిపోయింది. అలానే, హీరోయిన్ 'సలోని మిశ్ర' తో దాస్ కెమిస్ట్రీ కూడా బాగుంది ట్రైలర్ లో. ఇంకా వివేక్ సాగర్ మ్యూజిక్ ట్రైలర్ కె స్పెషల్ అట్రాక్షన్.  2017 లో అర్జున్ రెడ్డి, 2018 లో RX 100 , 2019 లో ఫలక్నుమా దాస్ అని యూత్ అప్పుడే ఫిక్స్ అయిపోయారు. మరి చూడాలి ఈ మాస్ కా దాస్ సమ్మర్ ని ఇంకెంత వేడెక్కిస్తాడో.


మరింత సమాచారం తెలుసుకోండి: