విజయ్ దేవరకొండకి అర్జున్ రెడ్డి సినిమాతో వచ్చిన క్రేజు అంతా ఇంతా కాదు. ఈ సినిమా అతన్ని అన్ని బాషలలోకి తీసుకుని వెళ్ళింది. ముఖ్యంగా ఒక యంగ్ హీరోకి ఈ రేంజ్ లో పేరు రావడం చాల కష్టమనే చెప్పాలి. ఎన్నో చిన్న చిన్న పత్రాలు చేకుంటూ హీరో అవ్వాలనే పట్టుదలతో విజయ్ చాల కష్టపడ్డాడు. ఉన్న పాత్రలనే సరిపెట్టుకోకుండా తన లక్ష్యం కోసం చాల పోరాడి అర్జున్ రెడ్డి సినిమాలో ఛాన్స్ సంపాదించి అర్జున్ రెడ్డి అంటే విజయ్, విజయ్ అంటే అర్జున్ రెడ్డి తరహలో యూత్ లో మంచి పేరును గుర్తింపును సొంతం చేసుకున్నాడు.

 

అర్జున్ రెడ్డి, గీత గోవిందం లాంటి సినిమాల సక్సెస్ తరువాత “డియర్ కామ్రేడ్” సినిమా చేసాడు విజయ్. ఈ సినిమా పై కూడా పెద్ద అంచనాలే ఉన్నాయి విజయ్ కి. సినిమాలు మాత్రమే కాదు విజయ్ కి విభిన్నంగా జీవించడం అన్నా సరే చాలా ఇష్టం. అదే ఆలోచనతో తన పుట్టిన రోజున ఫ్రీ గా ఐస్క్రీంలు పంచుతూ పలు సిటీస్ లో హలచల్ చేసాడు మనోడు. పేపర్లు, పోర్టల్లులో కుడా అంతా ఇదే న్యూస్ కవర్ చేసారు.

 

తాజాగా విజయ్ దేవరకొండ ఒక ఆంగ్ల దినపత్రికకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ ఇంటర్వ్యూలో మీ వ్యక్తిగత లక్ష్యాలు ఏమైనా ఉన్నాయా అనే ప్రశ్నకు స్పందిస్తూ.. తన సినీ కెరీర్ లో సూపర్ హిట్ గా చెప్పుకొనే అర్జున్ రెడ్డిని చూసి సిగ్గుపడాలి అని నటుడిగా ఆ స్థాయికి ఎదగడమే తన లక్షం అని చెప్పాడు. లేకపోతె ఇంక ఎన్ని ఏళ్ళు గడిచిన అర్జున్ రెడ్డే తన కేరీర్ కి కొలమానం అయితే ఇక తను సాధించినది ఏముంటుంది అని చెప్పాడు.


మరింత సమాచారం తెలుసుకోండి: