తెలుగు టెలివిజన్ ప్రేక్షకులను ఎంతగానో అలరించిన షోలలో ప్రముఖమైన షో “బిగ్ బాస్” షో. ప్రస్తుతం ఐపీఎల్ సీజన్ అయిపోవడంతో షో నిర్వాహకులు సీజన్ 3 నీ చాలా గ్రాండ్ గా ప్రేక్షకులకు అందించే ఆలోచనలో  ఉన్నట్టు సమాచారం. ముఖ్యంగా మొదటి రెండు సీజన్లలో ఎక్కువగా మొదటి సీజన్ ప్రేక్షకులను ఎంతగానో అలరించింది దీంతో మొదటి సీజన్ లో ఎక్కువగా సెలబ్రిటీల ఉండటం మరియు హోస్ట్ గా యంగ్ టైగర్ ఎన్టీఆర్ వుండటంతో బిగ్బాస్ సీజన్ మొదటి భాగం సూపర్ డూపర్ హిట్ అయింది.

Related image

ఇదే క్రమంలో వచ్చిన రెండవ సీజన్ అంతగా అలరించలేకపోయింది..ఎక్కువగా రెండో సీజన్లో సెలబ్రిటీలు లేకపోవడమే దీనికి కారణమని మరియు యాంకరింగ్ నాని కూడా కొంత దెబ్బ వేసినట్లు కూడా చెబుతుంటారు. ఈ క్రమంలో మూడవ సీజన్ లో ఎక్కువగా సెలబ్రిటీలు పెట్టుకొని యాంకర్ అన్నదానిపై తర్జనభర్జన పడుతున్నారు షో నిర్వాహకులు.

Image result for bigg boss season 3

ప్రస్తుతం బయటకు వచ్చిన సమాచారం ప్రకారం నాగార్జున వెంకటేష్ అలాగే అనుష్క పేర్లు వినిపించినా వీరిలో నాగార్జున ఈ షో కు హోస్ట్ గా చేస్తారని తెలిసింది.కానీ ఇప్పుడు మళ్ళీ ఈ రేసులోకి వెంకీ మామ కూడా ఉన్నట్టు తెలుస్తుంది.దీనితో ఇప్పుడు నాగ్ మరియు వెంకటేష్ ఈ ఇద్దరి పేర్లు వినిపిస్తున్నాయి.మరి ఈ ఇద్దరిలో ఎవరు ఈ సీజన్లో కనిపిస్తారో చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: