నిరుపేద కుటుంబంలో పుట్టి అంచెలంచెలుగా ఎదుగుతు భారత రాష్ట్రపతి స్థానాన్ని సంపాదించుకున్న, యువత రోల్‌ మోడల్‌ భారతరత్న అవార్డు గ్రహీత, భారత మాజీ రాష్ట్రపతి, శాస్త్రవేత్త అబ్దుల్‌కలాం జీవితం ఆధారంగా ఓ సినిమా తెరపైకి తీసుకురావడానికి సన్నాహాలు జరుగుతున్నాయి అన్న విషయం విదితమే.

 

అయితే ఈ చిత్రం తెరకెక్కడానికి ఇంకా సమయం చాలానే ఉన్నట్లు తెలుస్తోంది. డ్రీమ్‌ మర్చెంట్స్‌ ఐఎన్‌సీ, అభిషేక్‌ అగర్వాల్‌ ఆర్ట్స్‌, పతాకాలపై రామబ్రహ్మం సుంకర, అభిషేక్‌ అగర్వాల్‌ ఈ బయోపిక్‌ను నిర్మించనున్నారు. కానీ కలాం గారి పాత్రకు ఏ నటుడైతే న్యాయం చేయగలడో అనే సందిగ్ధంలో పడ్డారట మేకర్స్.

 

అప్పుడే మేకర్స్ కి ఒక సీనియర్ బాలీవుడ్ నటుడు గుర్తుకోచ్చాడట. అతనెవరో కాదు నేషనల్ అవార్డు గ్రహీత పరేష్ రావెల్. ప్రస్తుతం మేకర్స్ ఆయనతో చర్చలు జరుపుతున్నారని సమాచరం. ఈ ప్రొజెక్ట్ లో అన్నిటికంటే పెద్ద ట్విస్ట్ ఏంటంటే అనిల్ సుంకర నిర్మాతగా తొలిసారిగా మెగా ఫోన్ పట్టి దర్శకుడిగా మరుతున్నారట.

 

ఈ జీవిత చరిత్రను మొదటగా ఇంగ్లీషులో తెరకెక్కించి ఆ తర్వాత పలు భాషల్లో డబ్‌ చేయనున్నారట. ప్రస్తుతం ఆ దిశగా సన్నాహాలు జరుగుతున్నాయి. కలాంగారి బాల్యం నుండి ఎదుర్కోన్న పరిస్థితులు ఆ తర్వాత శాస్త్రవేత్త, రాష్ట్రపతి ఇలా ఆయన జీవితం మొత్తాన్ని తెరపై చూపించడానికి సన్నాహాలు జరుగుతున్నాయని నిర్మాత అనిల్‌ సుంకర ప్రకటించారు. మొత్తానికి ఇలాంటి జీవిత చరిత్రలను తెరపై చూపించి యువత మార్గదర్శకం చూపించాలి అని చేసే ఈ ఆలోచనలు చాలా బాగున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: