అత్తారింటికిదారేది స‌క్సెస్‌తో స‌మంత చిందులేస్తుంటే, టాలీవుడ్‌లో మ‌రో స్టార్ హీరోయిన్ మాత్రం కోపంతో ఊగిపోతుంది. త‌నే కాజ‌ల్ అగ‌ర్వాల్‌. కాగ‌ల్ అగర్వాల్‌కి ఈ మ‌ధ్య కాలం టాలీవుడ్‌లో అవ‌కాశాలు త‌గ్గముఖం ప‌ట్టాయి. ముఖ్యంగా కోళీవుడ్ అఫ‌ర్లకే ప్రాధాన్యం చూపుతున్న కాజ‌ల్‌, టాలీవుడ్ నుండి అవ‌కాశాలు వ‌చ్చినా వాటికి దూరంగా ఉంటుందంటూ తెగ ప్రచారం జ‌ర‌గుతుంది. ఈ విష‌యంపై కాజ‌ల్ ఓ ఫ్యాష‌న్ షోకు అటెండ్ అయితే ఆమెను ఈ ఆఫ‌ర్స్ గురించి అడిగారు. దీనికి కాజ‌ల్ కూల్‌గా స‌మాధానం ఇచ్చింది. నాకు టాలీవుడ్ నుండి చాలా ఆఫ‌ర్లు వ‌స్తున్నాయి. నా డేట్స్ కాలీ లేకే నేను ఆఫ‌ర్లను మిస్ చేసుకోవాల్సి వ‌స్తుంద‌ని స్ట్రాంగ్‌గా క్లారిటి ఇచ్చింది.

వెంట‌నే ఆ రిపోర్టర్ మ‌రో ప్రశ్నను అడిగాడు. మీ తోటి హీరోయిన్స్ స‌మంత ఇప్పుడు టాలీవుడ్ టాప్ పొజిష‌న్‌లో ఉందిక‌దా, అందుకే మీ వ‌ర‌కు ఆఫ‌ర్స్ రావ‌డం లేదంట‌గా అని అన్నాడు. దాంతో కాజ‌ల్‌కు చిర్రొత్తుకొచ్చి, రెండు మూడు మూవీలు హిట్ అయితేనే ఇంత ఆనంద ప‌డాలా, నేను న‌టించిన ప్రతి మూవీ సూప‌ర్ హిట్లే. నేను ఎంత పండ‌గ చేసుకోవాలి అంటూ ఆవేశంతో స‌మాధానం చెప్పిందట‌. దీంతో అక్కడ ఏంజ‌రుగుతుందో రిపోర్టర్ తెలుసుకున్న వెంట‌నే కృష్ణవంశీ మూవీలో రామ్‌చ‌ర‌ణ్ స‌ర‌స‌న న‌టిస్తున్నారు క‌దా, ఆల్ ద బెస్ట్ కాజ‌ల్ అని అక్కడ నుండి వెళ్ళిపోయాడు. కాజ‌ల్‌కి టాలీవుడ్ ఆఫ‌ర్లు ఎందుకు త‌గ్గాయో తెలియ‌దు కాని, ఈమెపై మాత్రం రూమ‌ర్స్ త‌గ్గలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: