ఇప్పటి వరకు వెండి తెరపై ఎన్నో హర్రర్ సినిమాలు చూశాం..ఈ మద్య హర్రర్ సినిమాల్లో కామెడీ ఎంట్రటైన్ మెంట్ ఉండటంతో పెద్దగా భయం అనిపించేలా కనిపించడం లేదు.  ఒకప్పుడు హర్రర్ సినిమాలకు వెళ్లాలంటే తోడుగా ఎవరినైనా తీసుకు వెళ్లేవాళ్లం..ఇప్పుడు హర్రర్ మూవీస్ అంటే కడుపుబ్బా నవ్వుకుంటూ థియేటర్ల నుంచి బయటకు వచ్చే పరిస్థితి ఏర్పడింది.  అయితే అప్పుడప్పుడు పూర్తిగా హర్రర్, థ్రిల్లర్ జోన్ లో ఉన్న మూవీస్ కూడా వస్తున్నాయి. 


టాలీవుడ్ లోకి ఝమ్మందినాథం సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయిన బాలీవుడ్ బ్యూటీ తాప్సీ పొన్ను..వరుసగా మంచి విజయాలు అందుకున్నా కొంత కాలంగా ఆమెకు తెలుగు లో సక్సెస్ లు రావడం లేదు.  దాంతో బాలీవుడ్ కి పయణం అయ్యింది..అక్కడ వరుస సక్సెస్ లు అందుకుంటుంది.  ఆ మద్య లారెన్స్ తీసిన కాంచన సీక్వెల్ గంగ సినిమాలో ఛాన్స్ వచ్చినా పెద్దగా వర్క్ ఔట్ కాలేదు. తాజాగా తాప్సి మరోసారి భయపెట్టేందుకు వస్తుంది. 


తాజాగా  తాపీ నటిస్తున్న గేమ్ ఓవర్ అనే సినిమా టీజర్ ను రీసెట్ గా విడుదల చేశారు. ఈ సినిమాలో ఓ మనిషికి రెండు జీవితాలు ఉంటే ఎలా ఉంటాయి..అందులో ఒకటి భయానకం అయితే..అనే కాన్సెప్ట్ తో ఉన్నట్టనిపిస్తుంది.  ఇక టీజర్ అంతా ఒక్క పనిమనిషి మాత్రమే కనిపిస్తుంది. విజువల్స్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఈ సినిమాకు ప్లస్ పాయింట్స్ లా కనిపిస్తుంది. ఇంతకీ ఈ సినిమాలో   దెయ్యం ఉందా.. లేకా తాప్సి ఆలోచనలే భయాన్ని కలిగిస్తున్నాయా? అనేది తెరపై చూడాలి. మరి సినిమా ఎలాంటి థ్రిల్ ని ఇస్తుందో తెలియాలంటే జూన్ 14వరకు వెయిట్ చేయాల్సిందే. 


మరింత సమాచారం తెలుసుకోండి: