పాపం బోయపాటి ... ఒకే ఒక్క ప్లాప్ అతని బ్రాండ్ వేల్యూను ఒక్క సారిగా క్రిందికి పడేసింది. తరువాతి సినిమా బాలయ్యతో ఫిక్స్ అయినప్పటికీ నెక్స్ట్ బోయపాటితో లేదని అర్థమయిపోతుంది. అయితే బోయపాటితో సినిమా చేయాలని ఓ పెద్ద నిర్మాత ప్రయత్నిస్తున్నారు. మాంచి పాపులర్ హీరోతో కాంబినేషన్. కానీ బోయపాటి మాత్రం ఇంకా ఊ అనడం లేదు. కారణం ఒక్కటే, బాలయ్యబంధం నుంచి స్మూత్ గా ఎలా బయటకు రావాలన్నది.


బాలకృష్ణతో సినిమా చేయాలని బోయపాటికి బలంగా వుంది. చిన్న చిన్న అపోహలు, అడ్డంకులు వున్నా, అవన్నీ వుండవని నమ్మకమూ వుంది. కానీ బాలయ్య వేరే సినిమా ఓకె చేసేసారు. అది ఇంకా మొదలుకావాల్సి వుంది. బాలయ్య చూస్తే గుళ్లూ గోపురాలు తెగ తిరిగేస్తున్నారు. ఎన్నికల ఫలితాలు రావాలి. ఆ వ్యవహారాలన్నీ సద్దుమణగాలి అప్పుడు కానీ ఆ సినిమా మొదలుకావాలి. ఈలోగా బోయపాటికి ఓ సినిమా బయట చేసుకుని రావాలని వుంది.


ఎందుకంటే ఎంతకాదన్నా పదికోట్ల రూపాయలు. చిన్న, చితకమొత్తం కాదు పారితోషికం. కానీ బాలయ్యకు కాస్త స్మూత్ గా విషయం విన్నవించి రావాలి. పైగా బాలయ్య బావ చంద్రబాబుతో బోయపాటి మంచి సంబంధాలు వున్నాయి. ఇక్కడ, అక్కడ అన్నీ అలా వుండాలి. ఏవీ తెగిపోకూడదు. అందుకే బాలయ్య ఎప్పుడు ఫ్రీ అయితే అప్పుడు వెళ్లి, విన్నవించుకుని, అప్పుడు బయట సినిమాకు రావాలన్నది ప్లాన్. అంతవరకు ఆ నిర్మాత వెయిటింగ్. బోయపాటి కూడా.

మరింత సమాచారం తెలుసుకోండి: