ఇండస్ట్రీలో కామ పిశాచులుకు కొదువే లేదు. అమ్మాయిలను లైంగికంగా హింసించడానికి కూడా వెనుకాడటం లేదు. ఇప్పటికే క్యాస్టింగ్ కోచ్ పెద్ద దుమారం రేపిన సంగతి తెలిసిందే. తాజాగా ఓ డైరెక్టర్‌తో తనకు జరిగిన అన్యాయాన్ని గాయని ప్రణవి ఆచార్య వెల్లడించారు. ఆమె చెప్పిన విషయాలు ఏమిటంటే.. చిన్నతనం నుంచి నాకు గాయని కావాలనే కోరిక ఉండేది. నేను ఇంటర్మీడియెట్ చదువుతుండగా సినిమాలో పాట పాడే అవకాశం లభించింది.


ఓ డైరెక్టర్ నాకు కబురు పెట్టగా అతడి వద్దకు వెళ్లాను. ఆయన నాతో ఏదో తేడాగా ప్రవర్తిస్తున్నట్టు అర్థమైంది. వెంటనే నేను జాగ్రత్త పడేందుకు సిద్ధమయ్యాను. స్వతహాగా నేను ధైర్యవంతురాలిని కావడంతో అంతగా భయపడలేదు అని ప్రణవి చెప్పారు. ఆడైరెక్టర్ తన మనసులో ఉండే అసలు విషయాలను బయటపెట్టడం మొదలుపెట్టారు. నీకు నేను ఆఫర్ ఇస్తాను. కానీ పడకగదిలోకి వస్తావా అని అడిగారు. దాంతో నా దిమ్మతిరిగింది.


నేను చిన్నపిల్లను. ఇంటర్మీడియెట్ చదువుతున్నాను. నాలాంటి అమ్మాయితో అలా ప్రవర్తించడం సరికాదని చెప్పాను. ఇక ఆఫర్ రాదని కన్ఫర్మ్ చేసుకొన్నాను అని ప్రణవి వెల్లడించారు. ఇక ఎలాగైనా డైరెక్టర్‌కు బుద్ధి చెప్పాలని భావించాను. ఆయనకు ఎదురు చెప్పడం మొదలుపెట్టాను. ఇక తాను నాపై ఏదో కామెంట్లు చేయబోగా.. మరో మాట ఎక్కువగా మాట్లాడితే చెప్పుతో కొడుతాను అని హెచ్చరించాను. దాంతో ఆ డైరెక్టర్ కంగు తిన్నాడు. అప్పటి నుంచి నేను చాలా కఠినంగా ఉండటం మొదలుపెట్టాను. అవకాశాల కోసం తిరిగే సమయంలో చాలా కంట్రోల్‌లో ఉండేదానిని అని ఇటీవల ఓ మీడియాకు వెల్లడించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: