మహానటి తర్వాత కీర్తి సురేష్ కి తమిళంలో బోలెడన్ని అవకాశాలు వస్తూనే ఉన్నాయి. ఏమాత్రం ఆలోచించకుండా చేసుకుంటు వెళుతోంది. విక్రం, విజయ్, సూర్య..ఇలా స్టార్స్ తో సూపర్ డూపర్ హిట్స్ తో తమిళ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్‌గా తనకంటూ ఒక ప్రతేకమైన గుర్తింపుతో స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకుంది. అంతేకాదు బోనీ కపూర్ ప్రొడక్షన్ లో నటిస్తూ బాలీవుడ్‌లో గ్రాండ్ ఎంట్రీ ఇవ్వబోతోంది.


ఇక ఈ సినిమాతో పాటు రీసెంట్‌గా మరో లేడీ ఓరియంటెడ్ సినిమాలో అద్భుతమైన పాత్ర పోషిస్తోంది. మహేశ్ కోనేరు నిర్మిస్తోన్న ఈ సినిమాతో నరేంద్ర అనే యువకుడు దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. ఈ సినిమాలో, రాజేంద్ర ప్రసాద్, సీనియర్ నరేశ్, నదియా కీలకమైన పాత్రలను పోషిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగు యూరప్ లో జరుగుతోంది.


ప్రధాన పాత్రలకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను అక్కడ చిత్రీకరిస్తుండగా ఈ సినిమాకి చిత్ర బృందం 'సఖి' అనే టైటిల్ ను ఖరారు చేసినట్టుగా లేటెస్ట్ అప్డేట్. ఈ టైటిల్ కి ముందు వేరే టైటిల్స్ అనుకున్నప్పటికి కీర్తి పోషిస్తున్న క్యారెక్టర్ కి 'సఖి' టైటిల్ అయితే పర్‌ఫెక్ట్ అని దర్శక,నిర్మాతలు భావిస్తున్నారట. ఇక ఈ సినిమాతో పాటు కింగ్ నాగార్జున నటిస్తున్న మన్మథుడు-2 లో ఓ ముఖ్య పాత్ర పోషిస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: