టాలీవుడ్ లో వరుస విజయాలు అందుకుంటున్న నేచురల్ స్టార్ నాని ఆ మద్య కృష్ణార్జున యుద్దం, దేవదాస్ తో డీలా పడ్డారు. మంచి విజయం కోసం ఎదురు చూస్తున్న నాని గత మూడు సినిమాలతో పెద్దగా మెప్పించని ఈ యువ హీరో జెర్సీ సినిమాతో బాక్స్ ఆఫీస్ హిట్ అందుకునేలా కనిపిస్తున్నాడు. నాని-గౌతమ్ తిన్ననూరి కాంబినేషన్ లో వచ్చిన సినిమా జెర్సీ. హీరో నాని తొలిసారి రెమ్యూనిరేషన్ తీసుకోకుండా, బిజినెస్ లో షేర్ తీసుకుని చేసిన సినిమా ఇది.
రిలీజ్ అయిన అన్ని సెంటర్లలో పాజిటీవ్ టాక్ తెచ్చుకొని విమర్శకుల నుంచి ప్రశంసలు పొందింది. క్రికెట్ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన జెర్సీ సినిమాకు మళ్ళీ రావా దర్శకుడు గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించగా సూర్యదేవర నాగవంశీ సినిమాను నిర్మించారు.
ఈ సినిమాకు పోటీగా కాంచన 3 రిలీజయినప్పటికీ జెర్సీ మంచి కలెక్షన్స్ అందుతున్నాయి. ఈ మూవీ ఇక వరల్డ్ వైడ్ గా సినిమా మంచి ఓపెనింగ్స్ ను అందుకుంది. తెలుగు రాష్ట్రాల్లో 4.6 కోట్ల షేర్స్ అందుకున్న జెర్సీ ఓవర్సీస్ లో 1.70కోట్ల వరకు రాబట్టినట్లు తెలుస్తోంది. ఇక కర్ణాటక లో కోటికి పైగా కలెక్షన్స్ రాగా వరల్డ్ వైడ్ గా 7.12కోట్ల షేర్స్ ను జెర్సీ అందుకుంది.ః
ఏరియా వైజ్ గా జెర్సీ కలెక్షన్లు :
ఏరియా బిజినెస్ (కోట్లలో ) షేర్స్ (కోట్లలో)
నైజాం-వైజాగ్ 10.00 14.04
సీడెడ్ 3.20 2.82
నెల్లూరు 0.80 0.86
కృష్ణ 1.45 2.06
గుంటూరు 1.80 1.98
ఈస్ట్ గోదావరి 1.60 2.02
వెస్ట్ గోదావరి 1.25 1.38
టోటల్ ఏపీ, టీఎస్ 20.10 25.16
ఇతర ప్రాంతాలు 2.50 3.10
ఓవర్సీస్ 4.00 5.75
వరల్డ్ వైడ్ టోటల్ 26.60 34.01