కేజీఎఫ్ కన్నడ సంచలన చిత్రం... ఎన్నో అరుదైన రికార్డులను తన ఖాతాలో వెసుకుంది. కన్నడలోనే కాకుండా హిందీ, తమిళ, తెలుగు భాషాల్లో కూడా విజయాలు సాధించి చిత్రసీమలో తిరగరాయలేని మొత్తాన్ని తన ఖాతాలో వేసుకుంది. రాకింగ్ స్టార్ యష్ కథానాయకుడిగా ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన చిత్రాన్ని రూపోందించారు. 



పలు భాషాల్లో విడుదలైన కేజీఎఫ్ మొదటి భాగం అందరిని ఆకట్టుకుంది. అయితే ఇప్పుడు ఈ చిత్ర రెండోవ భాగాన్ని చిత్రీకరిస్తున్నారు. ‘కేజీఎఫ్ ఛాప్టర్-2’ షూటింగ్ మొదలయ్యాక ఇప్పటిదాకా ఏలాంటి వార్తలు వెలువడలేదు. ‘కేజీఎఫ్ ఛాప్టర్-1’కు సంబంధించి ప్రేక్షకుల్ని ఎక్కువ ఆకర్షించింది యాక్షన్ పార్టే. హీరో ఎలివేషన్లు, యాక్షన్ ఎపిసోడ్లు చూసి జనాలకు మతిపోయింది. ‘ఛాప్టర్-2’లో ఇంతకుమించి యాక్షన్ ఉండే విధంగా రూపొందించాడు దర్శకుడు ప్రశాంత్ నీల్. మరింతగా హీరోయిజంతో రెండో భాగాన్ని అతను తీర్చిదిద్దుతున్నారు. ప్రస్తుతం ఈ చిత్రంలో బాలీవుడ్, టాలీవుడ్ నటులు కూడా నటిస్తున్నట్లు కూడా ప్రశాంత్ ధ్రువీకరించాడు. 



ఇందులో మొదటిగా టాలీవుడ్ల్ లో అగ్రనటులుగా తనకంటూ ఒక స్థానాన్ని ఏర్పరుచుకున్న వ్యక్తి రావు రమేష్. తన డైలాగ్ డెలివరితీ ప్రేక్షకుల మనసు దోచుకోవడంలో ఆయనే దిట్ట. మజిలీ సినిమాలో ఆయన నటనకు అందరూ హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. ఇప్పుడు వీటన్నిటికి మించిన పాత్ర ఆయన్ను వెత్తుక్కుంటూ వచ్చింది. అదే కేజీఎఫ్ 2లో ఒక కీలక పాత్ర పోషించనున్నట్లు ప్రశాంత తెలిపారు. కేజీఎఫ్ 2లో ఆయనకు ఏలాంటి పాత్ర ఇచ్చినా ఆ పాత్రలో ఒదిగిపోతారనడంలో ఎలాంటి సందేహం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: