టాలీవుడ్ లో అప్పట్లో యాక్షన్ హీరోగా పేరు తెచ్చుకున్నారు భాను చందర్.  మార్షల్ ఆర్ట్స్ లో  ప్రత్యేక శిక్షణ పొంది ఆయన ఎన్నో సినిమాల్లో యాక్షన్ హీరోగా నటించారు.  అప్పట్లో భాను చందర్, సుమన్ కాంబినేషన్ లో వచ్చిన యాక్షన్ సినిమాలకు మంచి ఆదరణ లభించేది.  ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభింకచిన ఆయన అన్ని రకాల పాత్రల్లో నటిస్తున్నారు. తాజాగా నటుడు భాను చందర్ ఓ ఇంటర్వ్యలో మాట్లాడుతూ..అప్పటి, ఇప్పటి సినిమాల వ్యత్యాసం గురించి మాట్లాడారు. 


అప్పట్లో మేము వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళ్లే వాళ్లం. రోజుకు మూడు షిఫ్టులలో పనిచేసేవాళ్లం. అప్పటి సినిమాల్లో కథ ఉండేది .. మంచి సంగీతం ఉండేది .. యాక్షన్ సీన్స్ సహజత్వానికి దగ్గరగా వుండేవి. ఇప్పుడు ఒక్క హీరో ఒకటీ..రెండు సంవత్సరాలు సుదీర్ఘ విరామం తీసుకుంటున్నారు. కెరీర్ లో ఓ పది సినిమాలు తీస్తే చాలు అనుకుంటున్న పరిస్థితి.  ఇప్పడు వస్తున్న మూవీస్ లో మంచి కథ, ఆకట్టుకునే సంగీతం ఉండటం లేదు. ఇక యాక్షన్ సీన్స్ సహజత్వానికి చాలా దూరంగా ఉంటున్నాయి. చిటికేస్తే సుమోలు గాల్లోకి లేవడం .. కాలుతో నేలను తంతే ట్రక్కులు పైకి లేవడం .. ఒంటి చేత్తో ట్రైన్ ను ఆపడం వంటివి చూస్తుంటే నవ్వొస్తోంది. 


ఇక నేను నటించిన సినిమాల్లో నాకు ఎంతో ఇష్టమైన పాటలు రెండు ఉన్నాయి.  'మంచి మనసులు' సినిమాలో 'జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై ..' అనే పాట ఒక అద్భుతం. ఈ పాటను ఆత్రేయగారు రాయగా ఇళయరాజా గారు స్వరపరిచారు. ఆ పాట ఇప్పటికీ చాలా చోట్ల నేను వింటూనే ఉన్నాను.  ఇక 'నిరీక్షణ' సినిమాలోని 'సుక్కల్లే తోచావే .. ఎన్నెల్లే కాచావే .. ఏడబోయావే' అనే పాట కూడా నాకు చాలా ఇష్టం. ఈ మద్య వచ్చిన సినిమాల్లో 'జెర్సీ'  కథా కథనాలు ఎంత కొత్తగా ఉన్నాయో. అలాంటి సినిమాలను ప్రోత్సహించాలి  అని చెప్పుకొచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: