మామా అల్లుళ్ళు కలిసి నటిస్తున్న లేటెస్ట్ సినిమా 'వెంకీ మామ'. విక్టరీ వెంకటేష్-అక్కినేని నాగ చైతన్య కలిసి నటిస్తున్న ఈ సినిమాను ప్రముఖ నిర్మాత డి.సురేష్ బాబు టీ.జీ. విశ్వప్రసాద్ తో కలిసి నిర్మిస్తున్నారు. దాదాపు 5-6 సినిమాలు సురేష్ ప్రొడక్షన్స్ నుండి రిలీజవడానికి సిద్దమవుతున్నాయి. ఇక సురేష్ ప్రొడక్షన్స్ నుండి సినిమా వస్తుందంటే ప్రేక్షకుల్లో ఎలాంటి క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. 


ఇక వెంకీ-చైతు కాంబినేషన్‌లో వస్తున్న సినిమా గురించి ఇప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీలో కొన్ని చర్చలు జరుగుతున్నాయి. ఈ సినిమా సూపర్ డూపర్ హిట్టవడం ఖాయమని చిత్ర బృందం చాలా కాన్‌ఫిడెంట్‌గా  ఉన్నారట. ఈ సినిమాలో వెంకీకి జోడీగా 'ఆర్.ఎక్స్.100' ఫేం పాయల్ రాజ్ పుత్ నటిస్తుండగా చైతుకి జోడీగా రాశీఖన్నా నటిస్తోంది.


ఇక ఈ సినిమా బిజినెస్ విషయంలో సురేష్ బాబు చాలా స్ట్రాంగ్ గా ఉన్నాడట. రెండు, మూడు ఛానల్లకు శాటిలైట్ రైట్స్ గురించి చర్చిస్తున్నట్లు సమాచారం. దాదాపు ఈ సినిమాకు 13 కోట్ల రైట్స్ చెబుతున్నారట. అందుకు కారణం 'ఎఫ్2' తో వెంకీకి 'మజిలీ' తో చైతూకి బ్లాక్ బస్టర్ హిట్స్ ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. అందుకే సురేష్ బాబు వెంకీ మామ సినిమాకు శాటిలైట్ హక్కుల కోసం 13 కోట్ల వరకు చెబుతున్నారట.


మరింత సమాచారం తెలుసుకోండి: