అందమా నీ పేరేంటి అంటే అటే చూపిస్తుంది. పరువమా నీ పవరేంటి అంటే మళ్ళీ ఆమె వైపే చూస్తుంది. గ్లామర్ ఘాటుకు కేరాఫ్ ఈషా రెబ్బా. అచ్చ తెలుగు అందం. అందరినీ మెప్పించే అభినయం. మరి అన్నీ ఉన్నా అద్రుష్టం మాత్రం ఎందుకో ఫ్రంట్ డోర్ తెరవడంలేదు. ఈషా రెబ్బా ను చూసి అబ్బా అంటారు కానీ ఆఫర్లు మాత్రం ఇవ్వడంలేదు.


ఇటీవల త్రివిక్రమ్  జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం "అరవింద సమేత". ఇందులో రెండో హీరోయిన్‌గా నటించింది. ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించే అవకాశం కొట్టేసింది. అదేసమయంలో ఈ అమ్మడుకు స్టార్ హీరోయిన్‌గా ఎదగడానికి కావలసిన అన్ని క్వాలిటీలు ఉన్నప్పటికీ.. అగ్ర హీరోలతో నటించే అవకాశమే రావడంలేదని వాపోతోంది. స్టార్ హీరోయిన్ గా టాలీవుడ్ ని ఏలాలన్నది ఈషా డ్రీం


మరి ఆమెతో జత కట్టేందుకు మాత్రం టాలీవుడ్ అగ్ర నటులు ఎందుకో నో చెప్పేస్తున్నారు. దీంతో కసి మీదున్న ఈషా సంగతి ఇక్కడే తేల్చుకుంటానంటోంది. వరుసగా గ్లామర్ ఫోటో షూట్‌లు చేస్తూ... సోషల్ మీడియాలో దూసుకుపోతోంది. తాజాగా, జిగేల్ అనిపించే బ్లాక్ కలర్ డ్రెస్‌తో ఫోటో షూట్ చేసి ఆ ఫోటోను ట్విట్టర్‌లో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. దెబ్బకు ఆఫర్ల వెల్లువ కురవాల్సిందేనని ఈషా అంటోంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: