ప్రస్తుతం టాలీవుడ్ లో మంచి క్రేజ్, హిట్స్ తో దూసుకుపోతున్న నటీమణుల్లో రాశి ఖన్నా కూడా ఒకరు అనే చెప్పుకోవాలి. గత ఏడాది ఆమె వరుణ్ తో జత కట్టిన సినిమా తొలిప్రేమ ఎంతటి ఘనవిజయాన్ని అందుకుందో అందరికి తెలిసిందే. ఇక ఈ ఏడాది ఈ భామ మరికొన్ని తెలుగు మరియు తమిళ సినిమాల్లో నటిస్తోంది. ఇకపోతే ఇటీవల ఈమె తమిళ హీరో విశాల్ తో జతకట్టిన అయోగ్య సినిమా కొద్దిరోజుల క్రితం తమిళ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తెలుగులో ఎన్టీఆర్ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన టెంపర్ కు రీమేక్ ఇది. ఇక ప్రస్తుతం ఆ సినిమా మంచి టాక్ తో తమిళనాట దూసుకెళ్తోంది కూడా. 

ఇక ఈ సినిమా మంచి హిట్ అవ్వడంతో ఆ సినిమా యూనిట్ పై అందరినుండి మంచి ప్రశంశలు అందుతున్నాయి. ఇక మరీ ముఖ్యంగా హీరో విశాల్, హీరోయిన్ రాశి ఖాన్నాల జోడి సినిమాలో అద్భుతంగా ఉందని, మంచి కథాంశాన్ని తీసుకుని దర్శకుడు సినిమాని ఎంతో అద్భుతంగా తెరకెక్కించాడని ప్రశంశలు అందుతున్నాయి. ఇకపోతే ఇటీవల ఈ సినిమాకు సంబంధించి విడుదలైన క్రెడిట్స్ విషయంలో సినిమాకు పనిచేసిన అన్ని విభాగాల టెక్నీషియన్లు మరియు ఆర్టిస్టులకు ఆ క్రెడిట్స్ దక్కాయి. అయితే ఇందులో తమకు స్థానం దక్కకపోవడం పై సినిమాలో రాశికి డబ్బింగ్ చెప్పిన రవీనా ట్విట్టర్ వేదికగా తన బాధను వెలిబుచ్చారు. అయితే ఆమె ట్వీట్ కు స్పందించిన హీరోయిన్ రాశి, సారీ మమ్మల్ని క్షమించండి, 

నిజానికి ఇది మా తప్పిదమే, సినిమాలో నా పాత్ర ఎంతో మంచి పేరు సంపాదించడానికి నాకు గాత్రం అందించిన రవీనా కూడా ఒక ముఖ్య కారణం అని, అయితే ఆమెను క్రెడిట్స్ విషయంలో విస్మరిందడం మా తప్పిదమే అని రాశి ట్విట్టర్ ద్వారా ఆమెకు క్షమాపణలు చెపుతూ ఒక ట్వీట్ చేసారు. దానిపై ప్రతిస్పందించిన రవీనా, మాకు క్రెడిట్ ఇవ్వకపోవడంలో మీ తప్పు ఏమి లేదు, అయినా మమ్మల్ని కూడా గుర్తించి మీరు ట్వీట్ చేసినందుకు మీకు థాంక్స్ అంటూ రిప్లై ఇచ్చింది. నిజానికి రాశి ఒక్కరే, రవీనా ట్వీట్ కి స్పందించాల్సిన అవసరం లేకపోయినప్పటికీ కూడా మంచి మనసుతో ముందుకొచ్చి డబ్బింగ్ ఆర్టిస్టులకు అండగా నిలబడి మాట్లాడడం నిజంగా ఎంతో హర్షణీయమని నెటిజన్లు రాశి పై పొగడ్తల జల్లు కురిపిస్తున్నారు.....!!


మరింత సమాచారం తెలుసుకోండి: