మెగా ఫ్యామిలీలో అల్లుశిరీష్ మిగతా వారితో చాలా వెనకబడిఉన్నాడని చెప్పాలి. అయితే ఏ హీరోకైనా యాక్షన్ ఇమేజ్ చాలా అవసరం. ఫ్యాన్ బేస్ పెరగడానికి ఇది బాగా పనికొస్తుంది. కానీ అల్లు శిరీష్ మాత్రం తనకు అలాంటి ఇమేజ్ వద్దంటున్నాడు. అందుకే యాక్షన్ సినిమాలు వద్దనుకుంటున్నానని తేల్చిచెప్పాడు. "ఫన్, రొమాన్స్ ఉన్న సినిమాలంటే నాకిష్టం. ప్రేమ కథలు నా ఫేవరెట్. తర్వాత ఫ్యామిలీ డ్రామా, రొమాన్స్.


యాక్షన్ సినిమాలంటే నాకిష్టమే. కానీ ఇప్పుడు చేయలేను. యాక్షన్ చేయడానికి ఇంకా టైమ్ ఉంది. ఆ విషయంలో నాకు కంగారేం లేదు. ప్రస్తుతానికైతే ఫన్, డ్రామా సినిమాలే ఎక్కువగా చేయాలని అనుకుంటున్నాను. చాలామంది వచ్చి యాక్షన్ కథలు చెప్పారు, అవి నాకు నచ్చాయి కూడా. కానీ కావాలనే వద్దనుకున్నాను. "ఇలా యాక్షన్ ఇమేజ్ పై తన అభిప్రాయాన్ని బయటపెట్టాడు శిరీష్.


ఇప్పటికిప్పుడు తను యాక్షన్ సినిమా చేస్తే ప్రేక్షకులు ఆదరించరనే విషయాన్ని పరోక్షంగా చెప్పుకొచ్చాడు. మరోవైపు స్టార్ డైరక్టర్లపై కూడా రియాక్ట్ అయ్యాడు. ఇప్పటివరకు తనను ఒక్క పెద్ద దర్శకుడు కూడా సంప్రదించలేదని ఓపెన్ గా చెప్పుకొచ్చాడు. "ఇప్పుడున్న పెద్ద దర్శకుల్లో ఒక్కరు కూడా నన్ను సంప్రదించలేదు. ఇప్పటివరకు ఒక్క పెద్ద డైరక్టర్ కూడా నాకు కథ చెప్పలేదు. వాళ్ల హీరోలు వాళ్లకున్నారు. వంద కోట్ల మార్కెట్ ఉన్న హీరోలు చాలామంది ఉన్నారు. వాళ్లను వదులుకొని నా దగ్గరకు ఎవరొస్తారు చెప్పండి. పెద్ద డైరక్టర్లతో పనిచేయాలని ఉంది. ఆ అవకాశం ఎప్పుడొస్తుందో చూద్దాం." అని చెప్పుకొచ్చారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: