ఏ ఇండస్ట్రీలోనైనా డబ్బు కోసమే పనిచేసేవాళ్ళుంటారు. వీళ్ళకు ప్రత్యేకమైన గుర్తింపు అవసరం లేదు. అవసరాలకు మించి డబ్బు సంపాదన ఉంటే చాలు. కానీ అతి కొద్ది మందికే డబ్బు తో పని ఉండదు. గుర్తింపు, చరిత్ర పుటల్లో లిఖించదగ్గ కొన్ని పేజీలుండాలి అనుకుంటారు. గుర్తింపు వస్తే డబ్బు తన వెనకాలే వస్తుందనుకునే వాళ్ళు రాత్రింబవళ్ళు కష్టపడుతుంటారు. అలాంటి వాళ్ళలో సాహిత్య రచయిత శ్రీ సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు ప్రముఖులు. గీత రచయితగా ప్రపంచం మొత్తం గర్వించదగ్గ శాస్త్రి గారు ఎన్నో అద్భుతమైన పాటలు, మనసును హత్తుకునే పాటలు రాశారు. 


అయితే మాస్ పదాలతో పాటను రాయడం మానేసి కొంత కాలమైంది. కానీ ఒక పాపులర్ మ్యూజిక్ డైరెక్టర్ రాసిన ఒక మాస్ సాంగ్ మళ్ళీ శాస్త్రి గారిని కదిలించింది. మళ్ళీ అలాంటి పాటలు రాయాలనే ఆసక్తి కలిగింది. అందుకు కారణం. డి.ఎస్.పి. అవును దేవీశ్రీ ప్రసాద్ సంగీతమందించిన 'సన్నాఫ్ సత్యమూర్తి' లోని పాటే శాస్త్రి గారితో మళ్ళీ మాస్ పదాలతో పాటను రాయాలనే కుతూహలాన్ని రేకెత్తించింది. అందుకే దేవీ ని సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు ప్రశంసలతో ముంచెత్తారు.


'సన్నాఫ్ సత్యమూర్తి' సినిమాలో 'సూపర్ మచ్చి' పాట సాహిత్యానికి ఏకంగా సిరివెన్నెల.. దేవీని ప్రశంసించారట. నేను మాస్ పాటలు, ఐటమ్ సాంగ్స్ రాయకూడదని అనుకున్నాను. కానీ నీ పాట విన్నాక నాకు మళ్ళీ మాస్ పాటలు రాయాలనే ఆలోచన కలిగింది" ఈ పాటలో 'సండే సంత కాదా.. మండే ఎండలోన' అనే ప్రాస సిరివెన్నెలకు తెగ నచ్చిందని చెప్పారట.


మరింత సమాచారం తెలుసుకోండి: