విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారక రామారావు మనవడిగా తాత నట వారసత్వాన్ని అందిపుచ్చుకున్న హీరో జూనియర్ ఎన్.టి.ఆర్. నూనూగు మీసాల వయసులోనే రికార్డుల అంతు చూసిన యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ టాలీవుడ్ లో నవరసాలను పండించే హీరో అంటే అతనొక్కడే అనేంతగా క్రేజ్ సంపాదించాడు. 


బ్రహ్మర్షి విశ్వామిత్ర సినిమాలో బాలనటుడిగా నటించిన తారక్.. బాల రామాయణం సినిమాలో రాముడిగా మెప్పించాడు. ఇక నిన్ను చూడాలని సినిమాతో హీరోగా పరిచయమై స్టూడెంట్ నంబర్ 1తో సూపర్ హిట్ అందుకున్నాడు. ఎన్.టి.ఆర్ నట వారసత్వాన్ని బాలకృష్ణ తర్వాత అందుకున్న హీరో ఒక్క తారక్ మాత్రమే.


ప్రతి సినిమాకు అభిమానులను సైతం ఆశ్చర్యపరచే నటనతో మెప్పించే తారక్ మూడక్షరాల సంచలనానికి కేరాఫ్ అడ్రెస్ గా మారాడు. ప్రస్తుతం రాజమౌళి డైరక్షన్ లో ఆర్.ఆర్.ఆర్ సినిమా చేస్తున్నాడు ఎన్.టి.ఆర్. ఈ సినిమా లో తారక్ కొమరం భీమ్ గా కనిపించనున్నారు. ఈ సినిమాలో రాం చరణ్ కూడా అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్నారు.     


ఎంచుకున్న పాత్ర ఏదైనా దానిలో పరకాయ ప్రవేశం చేసి శభాష్ అనిపించుకునే విధంగా తారక్ నటన ఉంటుంది. అతని నటన చూసి మిగతా స్టార్ హీరోలు కూడా సర్ ప్రైజ్ అయ్యేలా చేస్తాడు. హిట్లు ఫ్లాపులతో సంబంధం లేకుండా కెరియర్ మొదట్లోనే సూపర్ హిట్లు కొట్టి మధ్యలో కొన్నాళ్లు వెనుకపడిన జూనియర్ ఎన్.టి.ఆర్ ఫైనల్ గా మళ్లీ హిట్ ట్రాక్ ఎక్కేశాడు. తారక్ ఇలాంటి పుట్టీరోజులా మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని తన నటనతో ఇంకా ఎంతో గొప్ప స్థాయికి వెళ్లాలని మనస్పూర్తిగా కోరుతుంది ఏపిహెరాల్డ్. కామ్.   



మరింత సమాచారం తెలుసుకోండి: