తేజ దర్శకత్వం లో వస్తున్న కొత్త సినిమా “సీత” ఈ నెల 24 వ తేదిన విడుదలకు సిద్ధంగా ఉంది. అయితే మేకర్స్ ఈ చిత్రం యోక్క ప్రీ-రిలీజ్ ఈవెంట్ ను నిన్న ఘనంగా జరిపారు. ఈ ఈవెంట్ కు చిత్ర యూనిట్ మొత్తం హాజరైంది. ఈ చిత్రం యొక్క ట్రైలర్ ఇప్పటికే ప్రేక్షకుల మన్ననలు పొందింది. ఈ సినిమా పై ఆడియన్స్ లో భారి అంచనాలు ఉన్నాయనే చెప్పొచ్చు. “నేనే రాజు నేనే మంత్రి” సినిమా తరువాత తేజ తీసిన సినిమా ఇది.

 

అయితే ఈ చిత్రం ప్రీ-రిలీజ్ ఈవెంట్ లో నటుడు సోను సూద్ హాజరయ్యారు. సోనూ సూద్ మాట్లాడుతూ ‘తెలుగు సినిమాల్లో నటించడం నా అదృష్టం. ఎక్కడ ఎంతో నేర్చుకోవచ్చు. ఈ ఇండస్ట్రీ ని నేను మర్చిపోలేను మళ్ళీమళ్ళీ తెలుగు చిత్ర పరిశ్రమలో నటించాలని ఉంది’ అని అన్నారు. ఈ చిత్రం లో నన్ను తీసున్నందుకు తేజ కి థాంక్స్ అని చెప్పుడు సోనూ.

 

“సీత’ సినిమా మొత్తం కూడా సీత పాత్ర చుట్టూ తిరుగుతుందని ట్రైలర్ చూస్తేనే అర్ధం అవుతుంది. ఈ చిత్రం బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కు ఏంత అవసరమో మన డైరెక్టర్ తేజా కు కూడా అంతే ముఖ్యం, అవసరం కుడా. శ్రీనివాస్ జోరుగా చాల సినిమాలు చేసినా “జయ జానకి నాయక” తప్పితే సరైన హిట్ తగల్లేదు. కాని ఈ హీరో మాత్రం ఏప్పటికప్పుడు పోటి పాడటానికి తనను తను మార్చుకుంటున్నాడు అనే చెప్పాలి.

 

ఇక కాజల్ విషయానికి వస్తే అదే అందం అభినయంతో ప్రేక్షకుల మన్ననలు పొందుతుంది. ఈ భామ కేవలం తెలుగు చిత్రాల్లో మాత్రమే కాకుండా తమిళ, హిందీ చిత్రాలలో కుడా మంచి పేరు సంపాదించింది. చిన్న హీరోల దగ్గర నుండి మెగా స్టార్ సరసన వరకు నటించింది ఈ ముద్దుగుమ్మ. సీత చిత్రానికి అనూప్ రూబెన్స్ స్వరకల్పన చేస్తున్నారు.

 


మరింత సమాచారం తెలుసుకోండి: