ప్రముఖ బాలీవుడ్ నిర్మాత మరియు దర్శకుడు కరణ్ జోహార్, అక్కడి బడా ప్రొడ్యూసర్లలో ఒకరు అనే చెప్పుకోవాలి. అంతేకాదు ఎటువంటి సినిమాలు ఆడుతాయి, ఏ సినిమాలు ఎంతవరకు కలెక్ట్ చేసే అవకాశం ఉంది అనేటువంటి కొన్ని విషయాలపై అవగాహన కలిగి ఉన్న కరణ్ జోహార్, మన తెలుగు బాహుబలి రెండు భాగాలను అక్కడ హిందీ డబ్బింగ్ రైట్స్ కొనుగోలు చేయడం జరిగింది. అంతేకాదు తద్వారా అయన మంచి లాభాలను కూడా ఆర్జించారు. 

ఇకపోతే ప్రస్తుతం ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్ మూవీ కోసం అయన కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారట. ఇక ఈ సినిమా టైటిల్ విషయమై ఆ చిత్ర యూనిట్ ఇటీవల ఆర్ఆర్ఆర్ అనే పదాలను మీరు ఏ విధంగా టైటిల్ గా పెడితే బాగుంటుందో చెప్పండి అంటూ ప్రేక్షకులకు సోషల్ మీడియా వేదికగా కోరడం జరిగింది. అయితే రామ రావణ రాజ్యం, రఘుపతి రాఘవ రాజా రామ్, రాజు రామ రాజు, ఇలా పలు టైటిల్స్ ప్రేక్షకులు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం జరిగింది. అయితే ఈ విషయమై ఇప్పటివరకు ఏది కూడా ఆర్ఆర్ఆర్ టీమ్ ఫైనలైజ్ చేయడం జరగలేదు. 

ఇక ఈ టైటిల్ విషయమై ఇటీవల కరణ్ జోహార్ రాజమౌళితో మాట్లాడుతూ, ఈ సినిమాకు 'ఆర్ఆర్ఆర్' టైటిల్ అయితేనే సరిపోతుందని, ఎందుకంటే సినిమా పలు భాషల్లో విడుదల అవుతుంది కాబట్టి ఈ యూనివర్సల్ టైటిల్ బాగా సరిపోతుందని అన్నారట. అయితే కరణ్ మాటల్లో కూడా కొంత అంతరార్ధం ఉందని, ఇక సినిమా టైటిల్ మార్చాలా లేదా అనే దానిపై ఆ చిత్ర యూనిట్ తీవ్రంగా ఆలోచన చేస్తోందట. నిజానికి ఈ వార్త ఇప్పటివరకు ఎక్కడ అధికారికంగా బయటకు రానప్పటికీ, కొన్ని మీడియా వర్గాలలో నేడు ఈ న్యూస్ విపరీతంగా వైరల్ అవుతోంది. మరి ఈ వార్త అసలు నిజమో లేదో, ఈ సినిమా టైటిల్ అసలు మారుస్తారో లేదో తెలియాలంటే మరికొద్దిరోజుల్లో వేచిచూడాల్సిందే....!!  


మరింత సమాచారం తెలుసుకోండి: