సంచలన చిత్రాల దర్శకుడు రాంగోపాల్ వర్మ పేరు మన తెలుగు వారికి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదనే చెప్పాలి. విజయవాడ నుండి ముంబై వరకు సాగిన అయన సినీ ప్రస్థానం ప్రతి తెలుగువాడు గర్వంగా చెప్పుకునే విషయం అని చెప్పవచ్చు. ఇక ఏదైనా విషయం కానీ వ్యక్తులు కానీ తనకు నచ్చితే మాత్రం, వర్మ వారిని ఆకాశానికి ఎత్తేస్తుంటారు. ఇక కొన్నాళ్ల క్రితం సూపర్ స్టార్ మహేష్ బాబు తనకు ఫేవరెట్ అని, ఒకరకంగా చెప్పాలంటే వ్యక్తిగతంగా తనకు అమితాబ్ ని మించిన నటుడు మహేష్ అని అయన చెప్పుకొచ్చి అందరిని ఆశ్చర్యములో పడేశారు వర్మ. 

ఇక అప్పుడపుడు పవన్ కళ్యాణ్ పై తన అభిమానాన్ని కూడా తనదైన శైలిలో చాటుకునే వర్మ, కొద్దిసేపటి క్రితం విడుదలైన ప్రభాస్ సాహొ పోస్టర్ పై ఓక షాకింగ్ పోస్ట్ చేసి అయన ఫ్యాన్స్ అందరిని ఆశ్చర్యంలో పడేసాడు. మాస్ కా బాప్, క్రేజ్ కి పెట్టింది పేరు, బాక్సాఫీస్ రికార్డుల రారాజు, డార్లింగ్ ఆఫ్ డార్లింగ్స్ రేపు ఆగష్టు 15న సాహో విడుదల తరువాత దేశవ్యాప్తంగా ఉన్న రికార్డులన్నిటినీ తన పవర్ మరియు స్టామినాతో తుడిచిపెట్టేస్తాడు, మరణం మాస్ మరణం అంటూ పేట సినిమాలోని పాటను తన పోస్ట్ చివరిలో పెట్టి ట్విట్టర్ లో ప్రభాస్ పై ఒక పోస్ట్ చేసారు వర్మ. 

అసలు ఎప్పుడూ లేనిది వర్మ హఠాత్తుగా ప్రభాస్ పై ఎందుకింత ప్రేమ చూపిస్తున్నారో అర్ధం కాక కొందరు, వర్మ గారు మీరు ఫ్యూచర్ లో ప్రభాస్ తో సినిమా ఏదైనా సినిమా చేయబోతున్నారా? అందుకేనా ఇప్పటినుండి ప్రభాస్ ని కాకా పడుతున్నారు అంటూ సెటైరికల్ గా ఆయన పోస్ట్ కు రిప్లై ఇస్తున్నారు. కాగా వర్మ చేసిన ఈ పోస్ట్ ప్రస్తుతం టాలీవుడ్ మీడియా వర్గాల్లో విపరీతంగా వైరల్ అవుతోంది.....!!  


మరింత సమాచారం తెలుసుకోండి: