తేజ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన  అవసరం లేని టాప్ డైరెక్టర్. యూత్ లవ్ స్టోరీస్‌నే కాదు మహేష్ బాబు, రానా దగ్గుబాటి లాంటి స్టార్స్ తోను హిట్ సినిమాలు తీసి తనేంటో ప్రూవ్ చేసుకున్నాడు. వెండి తెరకు హీరో హీరోయిన్స్‌నే కాదు సంగీత దర్శకులను, లిరిక్ రైటర్స్ ను పరిచయం చేశారు. తను తీసిన సినిమాల వల్ల ఇప్పటి వరకు ఎవరు నష్టపోలేదనే చెప్పాలి. 'నేనే రాజు నేనే మంత్రి' తర్వాత వస్తున్న 'సీత' కోసం దర్శకుడు తేజ తో పాటు ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.


బెల్లంకొండ శ్రీనివాస్ కాజల్ జంటగా తెరకెక్కిన ఈ చిత్రం విడుదలకు సిద్దం అయ్యింది. అనూప్ రుబెన్స్ సంగీతమందిస్తున్న ఈ సినిమా మే 24 న గ్రాండ్‌గా రిలీజవనుంది. ఈ సందర్భంగా చిత్ర బృందం ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ఘనంగా నిర్వహించారు. ఈ ఈవెంట్‌లో దర్శకుడు తేజ ఎన్నో ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. స్టేజ్ పై ఎప్పుడు మాట్లాడాలన్నా కూడా నా మైండ్ బ్లాంక్ అవుతుంది. ఏమీ మాట్లాడాలో అర్థం కాదు. అంతేకాదు సినిమా ఎలా వచ్చిందని అడిగినప్పుడు కూడా మైండ్ అంతా బ్లాంక్ అవుతుంది. 


సినిమా ఎలా వచ్చిందో నేను చెప్పలేను. మీరే ఎలా వచ్చిందో చూసి చెప్పాలి. కళ్ల జోడు పెట్టుకున్నాడు వీడు పెద్ద ఇంటిలిజెంట్, జీనియస్ అనుకుంటే పొరపాటే. నాది ఒక యావరేజ్ బ్రెయిన్ అని చెప్పడం అందరికి నవ్వు తెప్పించింది. అంతేకాదు నేనే రాజు నేనే మంత్రి సక్సస్ మీట్ లో కూడా నేను హిట్ సినిమా తీయగలని ఈ సినిమా ప్రూవ్ చేసిందనడం కూడా అందరిని ఆశ్చర్యపరచింది. ఏదేమైనా తన వల్ల ఎవరు నష్టపోకూడదనేది తేజ మనస్తత్వం. 


మరింత సమాచారం తెలుసుకోండి: