తమన్నా ఇండస్ట్రీకి వచ్చి దాదాపుగా పదిహేనేళ్ళయింది.  ఇప్పటికి చాలాసార్లు తమన్నా కెరీర్ క్లోజ్ అయిందని కామెంట్స్ వినిపించాయి.  అంతెందుకు లాస్ట్ నవంబర్.. డిసెంబర్ లో కూడా ఇదే టాక్ విన్పించింది.  కానీ ఎప్పుడైతే 'F2' రిలీజ్ అయిందో అప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఆ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలవడం తో తమన్నా కెరీర్ పై వస్తున్న ఊహాగానాలకు తెరపడింది. ఇదిలా ఉంటే తమన్నా నటించిన రెండు సినిమాలు రిలీజ్ కు సిద్ధంగా ఉన్నాయి.


అందులో ఒకటి హిందీ ఫిలిం 'ఖామోషి' కాగా మరో సినిమా 'అభినేత్రి 2'. ఈ రెండు సినిమాలు మే 31 న రిలీజ్ అవుతున్నాయి.  'అభినేత్రి 2' సినిమా విషయమే తీసుకుంటే ఇది బాక్స్ ఆఫీస్ దగ్గర సక్సెస్ సాధించిన 'అభినేత్రి' అనే హారర్ కామెడీకి సీక్వెల్.  సినిమా రిలీజ్ దగ్గరపడడంతో ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి.  ఈ  సినిమానుండి 'రెడీ రెడీ' అంటూ సాగే వీడియో సాంగ్ ను రేపు రిలీజ్ చేశారు. 


భుదేవా, మిల్కీబ్యూటీ తమన్నా, బాలీవుడ్‌ నటుడు సోనూసూద్‌ ప్రధానతారణంగా విజయ్‌ దర్శకత్వంలో 2016లో రూపొంది మంచి విజయాన్ని సాధించిన చిత్రం 'అభినేత్రి'. ఈ సక్సెస్‌ఫుల్‌ సినిమాకు సీక్వెల్‌గా 'అభినేత్రి 2' చిత్రం రూపొందుతోంది. ట్రైడెంట్‌ ఆర్ట్స్‌, అభిషేక్‌ పిక్చర్స్‌ పతాకాలపై అభిషేక్‌ నామా, ఆర్‌.రవీంద్రన్‌ నిర్మాతలుగా విజయ్‌ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. 'అభినేత్రి 2'లో ప్రభుదేవా, తమన్నాలతో పాటు నందితాశ్వేత, డింపుల్‌ హయాతి, కోవైసరళ కీలక పాత్రల్లో నటించారు.


ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ మూవీ మే 31 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ప్రమోషన్లో భాగంగా ఈ చిత్రంలోని 'రెడీ రెడీ' అనే పాట మంగళవారం విడుదల చేసారు. పాటలో తమన్నా చిందులేస్తూ.. ప్రభుదేవాను ఆటపట్టిస్తూ కనిపించారు. ఈ సీక్వెల్ లో ప్రభుదేవాను రెండు దెయ్యాలను పీడించబోతున్నాయి.


నటిగా రాణించలేకపోయి, ఆత్మహత్య చేసుకున్న రూబీ అనే యువతి నటి తమన్నా శరీరంలోకి ప్రవేశించి, ప్రభుదేవాను ముప్పుతిప్పలు పెడుతుంది. కొన్ని పరిస్థితుల్లో చివరికి తమన్నా శరీరాన్ని విడిచి వెళ్లిపోతుంది. అయితే, మళ్లీ రూబీ ఎలా వచ్చింది.. ఎందుకు వచ్చింది.. తెలియాలంటే 'అభినేత్రి2' చూడాల్సిందే. ఇది హర్రర్ చిత్రం. తమిళంలో ఇప్పటికే విడుదల చేసిన టీజర్‌ ఆకట్టుకుంటోంది. అభిషేక్‌ పిక్చర్స్‌ పతాకంపై అభిషేక్‌ నామా ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ఈ చిత్రంలోని రెడీ రెడీ అనే వీడియో సాంగ్ ను విడుదల చేశారు. ఈ పాటలో తమన్నా బ్లాక్ కలర్ డ్రెస్‌లో చాలా హాట్‌గా ఉంది.

https://youtu.be/DWFl_ZYsRLM

మరింత సమాచారం తెలుసుకోండి: