సాయి ధరమ్ తేజ్...హీరోగా ఫిల్మ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చినప్పుడు మెగాస్టార్ పోలికలతో ఉన్న ఈ మెగా హీరో ఇండస్ట్రీని సూపర్ హిట్స్ తో షేక్ చేస్తాడనుకున్నారు అందరు. కానీ తన కెరీర్ లో ఇప్పటివరకు భారీ హిట్స్ అంటు ఒకటి అరా తప్ప కంటిన్యూ హిట్స్ లేకపోవడం మెగా హీరోకి పెద్ద మైనస్ అయింది. డాన్స్, ఫైట్స్, యాక్టింగ్..అన్నిటిలోనూ మంచి పర్ఫార్‌మెన్స్ ఉన్నప్పటికి ఎక్కడో కథల ఎంపిక సరిగ్గా లేక హిట్స్ కంటే ఫ్లాప్స్‌నే ఎక్కువగా చూశాడు. అయితే రీసెంట్‌గా 'చిత్రలహరి' సినిమాతో హిట్ ని దక్కించుకున్నాడు. 


మరీ బ్లాక్ బస్టర్ హిట్ అని చెప్పకపోయినప్పటికి నిర్మాత, బయ్యర్లు సేఫ్ జోన్‌లో ఉన్నారు. అయితే ఇదంతా తేజు తన పేరును న్యూమరాలజీ ప్రకారం మార్చుకున్నందుకే జరిగిందా అన్న ప్రశ్న కొందరిలో మెదులుతూ ఉంది. తేజు తన మొదటి సినిమా నుండి రీసెంట్ హిట్ సినిమా చిత్రలహరి ముందు వరకు 'సాయి ధరమ్ తేజ్' అని స్క్రీన్ టైటిల్ ని వేసుకున్నాడు. అయితే వరుస ఫ్లాప్స్ వల్ల తన పేరును సాయితేజ్ గా మార్చుకొని చిత్రలహరి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. 


నిజానికి ఈ సినిమా పెద్ద హిట్టేమీ కాదు. బ్లాక్ బస్టర్ అంతకన్నా కాదు. సినిమాను భారీ రేట్లకు అమ్మకుండా తక్కువకే అమ్మడంతో హిట్ అనిపించుకుంది.  నిజానికి సాయి తేజ్ సినిమాకు దాదాపు 20 కోట్ల మార్కెట్ ఉంది కానీ నిర్మాతలు 14 కోట్లకు మాత్రమే అమ్మారు.  'చిత్రలహరి' ఇప్పటివరకూ 15 కోట్లకు పైగా థియేట్రికల్ షేర్ వసూలు చేసింది. దీంతో ఈ సినిమాను కొన్న బయ్యర్లను సేవ్ చేసింది. ఆరు ఫ్లాపుల తర్వాత సాయి తేజ్ కు హిట్ పడింది.  మరి దీనికి కారణం తక్కువ రేట్లకు రైట్స్ అమ్మడమా లేక న్యూమరాలజీ ప్రకారం మార్చుకున్న 'సాయి తేజ్' పేరా? ఏదేమైనా మెగా మేనల్లుడికి  'చిత్రలహరి' తో రిలీఫ్ వచ్చింది.  


మరింత సమాచారం తెలుసుకోండి: